Breaking News

అమ్మకి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన మోనాలిసా..వీడియో వైరల్‌

Published on Thu, 02/20/2025 - 09:36

అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అంటారు. మోనాలిసా అనే అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. మొన్నటి వరకు ఇళ్లిళ్లూ తిరిగి పూసలు అమ్ముకున్న ఈ యువతి.. మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. పూసలు అమ్ముకునేందుకు ఆమె కుంభమేళాకి వెళ్లడం..తన నీలికళ్లు, అందం, చిరునవ్వుకు ఫిదా అయిన ఓ వ్యక్తి ఆమె ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం..అవికాస్త వైరల్‌ కావడంతో రాత్రికి రాత్రే ‘స్టార్‌’ అయిపోయింది. ప్రస్తుతం ఈ నీలికళ్ల సుందరి తన వ్యాపారాన్ని వదిలేసి..సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

మ‌ణిపూర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను క‌థానాయిక‌గా ఎంపిక చేసుకున్నాడు.. ఇక ఈ సినిమాకు పారితోషికంగా రూ.21 ల‌క్ష‌లు అందుకున్న‌ట్లు స‌మాచారం. అయితే మొద‌టి సినిమాకు పారితోషికం తీసుకున్న అనంత‌రం మోనాలిసా అన అమ్మ‌కి బంగారు గొలుసు కొనిపెట్టింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టా వేదిక‌గా తెలుపుతూ చూడండి అమ్మకి ఏం కొనిచ్చానో అంటూ వీడియో పెట్టింది.ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లుక్‌ మార్చేసిన బ్యూటీ
ప్రస్తుతం తనకున్న క్రేజీని మోనాలిసా క్యాష్‌ చేసుకుంటుంది. సినిమాలతో పాటు షాప్‌ ఓపెనింగ్స్‌కి కూడా వెళ్తోంది. తాజాగా ఓ బంగారు ఆభరణాల దుకాణం ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా వెళ్లింది. మొన్నటి వరకు  మేకప్‌ అంటే తెలియని మోనాలిసా..ముఖానికి మేకప్‌ వేసుకొని తన లుక్‌నే మార్చేసింది. జుట్టు కూడా చిన్నగా కత్తిరించుకుంది. మేకప్‌ తర్వాత ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ఒక హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్‌ అన్ని మోసాలిసాలో ఉన్నాయని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)