మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
విరాటపర్వం రోజే రిలీజవుతున్న మొనగాడు
Published on Sat, 06/11/2022 - 18:33
కీలుగుర్రం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆకుల వంశీ, పావని, దేవ్ గిల్, ఛత్రపతి శేఖర్ మొదలగువారు నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం మొనగాడు. వంశీ ఆకుల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత వంశీ ఆకుల మాట్లాడుతూ..."లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా మొనగాడు చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని కార్యక్రమలు పూర్తి చేసుకుని ఈ నెల 17న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఇందులో దేవ్ గిల్, ఛత్రపతి పాత్రలు చాలా పవర్ ఫుల్‌గా ఉంటాయి. నాలుగు ఫైట్స్, రెండు పాటలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం"` అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ః ఉదయ్ భాస్కర్; సంగీతంః ర్యాప్ రాక్ షకీల్; ఎడిటర్ః బొంతాల నాగేశ్వరరెడ్డి. కాగా జూన్ 17న విరాటపర్వం, గాడ్సే సినిమాలు సైతం విడుదలవుతున్నాయి. మరి మొనగాడు ఆ సినిమాల నుంచి ఎదురయ్యే పోటీని ఎలా తట్టుకుంటుందో చూడాలి!
చదవండి: కేరింత నటి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వైరల్
లేటెస్ట్ ట్రెండ్.. స్టేజ్‌పై స్టార్ హీరోల స్టెప్పులు
Tags : 1