Breaking News

లైంగిక వేధింపులు.. ఎలా బయటపడతానోనని భయమేసింది: నటి

Published on Sun, 07/16/2023 - 14:22

బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్‌ అయింది నటి మోనా సింగ్‌. 'జెస్సీ జైస్సీ కోయ్‌ నహీ' అనే సీరియల్‌తో క్లిక్‌ అయిన మోనా ఎక్కువగా రియాలిటీ షోలలో మెరిసింది. గతేడాది 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమా చేసిన ఈ నటి ఇటీవల 'కఫాస్‌' అనే వెబ్‌ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించింది.  కఫాస్‌ సిరీస్‌ ప్రస్తుతం సోనీ లివ్‌లో ప్రసారమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కింది.

ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న మోనా సింగ్‌ తాజాగా క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నేను కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల బారిన పడ్డాను. సీరియల్స్‌లో నటించే సమయంలోనే వేధింపులను ఎదుర్కొన్నాను. అప్పుడు నేను ఆడిషన్స్‌ కోసం పుణె నుంచి ముంబై వచ్చేదాన్ని. ఈ క్రమంలో కొందరు వ్యక్తులను కలిశాను. వాళ్లు చాలా విచిత్రంగా ప్రవర్తించేవారు, నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది, కొన్నిసార్లు భయమేసేది కూడా!

ఆడవాళ్లు ఎంత అమాయకులైనా, బలహీనులైనా.. అక్కడేం జరుగుతుందనేది ముందే పసిగట్టగలరు. మా అంచనా తప్పు కాదు! కొన్నిసార్లు వాళ్లు ఎంత నీచంగా ప్రవర్తిస్తారంటే.. వీళ్లబారి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలిరా దేవుడా.. అని భయంతో వణికిపోయేదాన్ని. ఎలాగోలా తప్పించుకునేదాన్ని. జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా అని ఈ సంఘటనల వల్ల మనం నిరాశకు లోనై వెనకడుగు వేయకూడదు, అనుకున్నది సాధించాలి. నేనూ అదే చేశాను. ప్రయత్నం విరమించకుండా నా కల సాకారం చేసుకున్నాను. ఇప్పటికీ ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది మోనా సింగ్‌.

చదవండి: బ్రెయిన్‌ స్ట్రోక్‌.. మాట పడిపోవడంతో ఇంటికే పరిమితం.. స్టార్‌ హీరో చెప్పిన అనుభవాలు
బాలయ్య హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్‌

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)