Breaking News

సొంతూరు వెళ్లిపోయిన 'మోనాలిసా'.. కారణం ఇదే

Published on Fri, 01/24/2025 - 16:31

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 'మోనాలిసా'(16) అనే యువతి అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేసింది. దీంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోటోలు, రీల్స్‌ పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమెతో ఫోటోలు దిగాలిని, దగ్గరగా చూడాలని చాలామంది ఎగబడుతున్నారు. కనీసం మెనాలిసా అన్నం తినేందుకు కూడా అవకాశం లేకుండా  అక్కడి వారు చేస్తుండటంతో ఆమె తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.

రుద్రాక్షలు, పూసలు అమ్ముకుందామని మహా కుంభమేళాకు మెనాలిసా కుటుంబం వచ్చింది. ఇప్పుడు ఆమె అందమే తన కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది. వారి వ్యాపారాన్ని పక్కన పెట్టేసి కూతురుని కాపాడుకునే పనిలో తండ్రి ఉన్నాడు. దీంతో ఆమెను తమ స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పంపించారు. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఒక వీడియో ద్వారా ఇలా పంచుకుంది. 

'రుద్రాక్షలు, పూసల దండలు అమ్మేందుకే ఇక్కడకు వచ్చాను, నా వల్ల మహా కుంభమేళాలో కాస్త అసౌకర్య వాతావరణం నెలకొంది. ఆపై నా కుటుంబంతో పాటు నాకు కూడా రక్షణ లేదు. మా ఫ్యామిలీ కొంతమేరకు ఇబ్బంది పడుతుంది. దీంతో ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్లిపోతున్నా.  అవకాశం ఉంటే మహా కుంభమేళా చివరన వచ్చి ఇక్కడ పుణ్యస్నానం చేస్తా. నాపై మీరు చూపిన ప్రేమ, మద్దతు ఎప్పటికీ మరిచిపోను. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.' అని చెప్పింది. ప్రయాగరాజ్‌లో నిన్న కొందరు దుండగులు మెనాలిసా కుటుంబం పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారని తెలుస్తోంది.  ఈ కారణం వల్లే ఆమె తమ గ్రామానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ ఇండోర్‌ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే  ప్రయాగరాజ్‌ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్‌ ఛానల్‌ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్‌ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్‌ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)