Breaking News

మార్చి రిపోర్ట్‌: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!

Published on Sun, 04/27/2025 - 12:45

మలయాళ సినిమా (Mollywood)కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుసగా బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్స్‌ నిర్మాతలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. కేవలం ఒకటీరెండు చిత్రాలు మాత్రమే నిర్మాతలను గండం గట్టెక్కిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో లాభాల పంటకు బదులుగా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు మార్చిలోనూ అదే వైఖరిని కొనసాగించాయి.

15 సినిమాల్లో ఒక్కటే హిట్టు
కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి.. మార్చి బాక్సాఫీస్‌ రిపోర్ట్‌ (Mollywood: March Box Office Report)ను రిలీజ్‌ చేసింది. ఈ నివేదిక ప్రకారం.. మార్చిలో 15 చిత్రాలు విడుదలవగా ఒక్కటి మినహా మిగతావన్నీ ఫ్లాప్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్‌ రూ.194 కోట్లు కాగా కేవలం రూ.25.88 కోట్ల షేర్‌ మాత్రమే తిరిగొచ్చింది. పెద్ద, చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఎల్‌ 2 : ఎంపురాన్‌ ఒక్కటే సూపర్‌ హిట్‌ సాధించింది. రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఔసెప్పింటె ఓసియతు మూవీ కేవలం రూ.45 లక్షలు రాబట్టడం గమనార్హం.

> రూ.2.70 కోట్లతో నిర్మితమైన పరివార్‌ సినిమాకు రూ.26 లక్షలు వచ్చాయి.
రూ.3.65 కోట్లు పెట్టి తీసిన వడక్కన్‌ మూవీ కేవలం రూ.20 లక్షలే తిరిగి రాబట్టింది.
రూ.70 లక్షలతో నిర్మితమైన డసెట్టంటె సైకిల్‌ చిత్రం అతి కష్టమ్మీద రూ.8 లక్షలు వసూలు చేసింది.

కాపాడింది ఈ ఒక్కటే..
మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ఎల్‌ 2: ఎంపురాన్‌. ఈ మూవీకి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. లూసిఫర్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. రూ.175 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)