Breaking News

రెహమాన్‌ నాకు తండ్రి లాంటి వ్యక్తి: మోహినిదే

Published on Tue, 11/26/2024 - 11:52

ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్‌, సైరా బాను దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా వార్తలు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే రెహమాన్‌ టీమ్‌లో పనిచేస్తున్న మోహినిదే అనే యువతి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్‌ నిర్ణయానికి లింక్‌ పెడుతూ రకరకాల వార్తలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా రిలేషన్‌ ఉందా అంటూ కోలీవుడ్‌లో భారీగా కథనాలు వచ్చాయి.

రెహమాన్‌ గురించి ఎక్కువగా చెడు ప్రచారం జరుగుతున్న సమయంలో రెండు రోజుల క్రితం సైరా బాను రియాక్ట్‌ అయింది. రెహమాన్‌ చాలామంచి వ్యక్తి అంటూ ఎవరూ తప్పుగా ప్రచారం చేయకండి అని ఆమె కోరింది. ఈ క్రమంలో తాజాగా మోహినిదే కూడా మరోసారి స్పందించారు. ఆ రూమర్స్‌ను ఖండిస్తూనే రెహమాన్‌  గోప్యతను గౌరవించాలని కోరింది.

మోహినిదే ఒక వీడియో సందేశాన్ని ఇలా పంపింది. 'నేను కొన్ని విషయాలను అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా జీవితంలో నాకు తండ్రితో పాటు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. నా కెరీర్ అభివృద్ధిలో వారందరూ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా ఏఆర్ రెహమాన్‌ నాకు తండ్రిలాంటివారు. ఇంకా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ మా నాన్న కంటే చిన్నవాడు. అతని కూతురు నా వయసు దాదాపు సమానంగానే ఉంటుంది. ఏఆర్ రెహమాన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను ఆయన టీమ్‌లో   8 సంవత్సరాలకు పైగా పనిచేశాను. 

అయితే, గత 5 సంవత్సరాల నుంచి అమెరికాలో ఒక పాప్ సంగీత కళాకారుడితో కలిసి పని చేస్తున్నాను. నాకు నా స్వంత బ్యాండ్ ఉంది. విడాకుల విషయంలో ఏఆర్ రెహమాన్‌పై వస్తున్న పుకార్లు చాలా బాధాకరం. ఆయన గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నాను.' అని ఆమె పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)