Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Tue, 01/23/2024 - 12:17

ఓటీటీలోకి మరో క్రేజీ బ్లాక్‌బస్టర్ వచ్చేసింది. 'సలార్'కి పోటీగా మలయాళంలో రిలీజైన ఈ మూవీ అద్భుతమైన హిట్‌గా నిలిచింది. కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచిందనే టాక్ వినిపించింది. ఇకపోతే ఈ సినిమాని వెంకటేశ్ రీమేక్ చేస్తారనే వార్తలొచ్చాయి కానీ అలాంటిదేం లేకుండానే తెలుగు వెర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీలో రిలీజైపోయింది. ఇంతకీ ఇదే సినిమా? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?

ఆ కాంబో మళ్లీ
మలయాళ ఇండస్ట్రీ అంటే డిఫరెంట్ సినిమాలకు పెట్టింది పేరు. స్టార్ హీరోలు కూడా ఇమేజ్ చట్రంలో పడిపోకుండా అప్పుడప్పుడు స్టోరీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటారు. అలా గతేడాది మోహన్‌లాల్ లాయర్ పాత్రలో 'నెరు' అనే సినిమా చేశారు. 'దృశ్యం' లాంటి థ్రిల్లర్ మూవీస్‌తోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో మనకు తెలిసిన ప్రియమణి కూడా ఓ లాయర్‌గా నటించడం విశేషం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)

ఆ ఓటీటీలోనే
ఇకపోతే మలయాళంలో మాత్రమే డిసెంబరు 21 ఈ సినిమా రిలీజైంది. నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సీరియస్‌గా సాగే కోర్టు రూమ్ డ్రామా చిత్రాలు ఇష్టపడితే మాత్రం దీన్ని అస్సలు మిస్సవొద్దు.

'నెరు' కథేంటి?
కళ్లు కనిపించని ఓ అమ్మాయి.. మానభంగానికి గురవుతుంది. అయితే వ్యక్తిని గుర్తించలేనప్పటికీ.. మట్టితో అతడి పోలికలున్న ఓ బొమ్మని తయారు చేస్తుంది. దీనిబట్టి పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకుంటారు. ఆ  తర్వాత కోర్టులో ఏం జరిగింది? బాధితురాలికి న్యాయం జరిగిందా? లేదా అనేది 'నెరు' స్టోరీ.

(ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్)

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)