Breaking News

రాజుగా మోహన్‌ లాల్.. వృషభ ట్రైలర్‌ వచ్చేసింది!

Published on Tue, 12/16/2025 - 20:52

మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌, తెలుగు యంగ్‌ హీరో రోషన్‌ తండ్రి, తనయులుగా నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి విడుదల కావాల్సిన ఈ ఫుల్ యాక్షన్‌ మూవీ క్రిస్‌మస్‌కు షిఫ్ట్ అయింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని మైథలాజికల్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలం నాటి విజువల్స్, యాక్షన్ సీన్స్‌ బాహుబలి తరహాలో మోహన్ లాల్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా ట్రైలర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్‌ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో అభిమానులను అలరించనున్నారు. 

కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నేహా సక్సెనా  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్‌, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్‌. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్‌ మాథుర్, సౌరభ్‌ మిశ్రా నిర్మించారు.  ఈ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న తమిళం, కన్నడ, హిందీలో విడుదల కానుంది.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)