Breaking News

అఫీషియల్: ఓటీటీకి స్టార్ హీరో డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Mon, 02/19/2024 - 20:59

మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం మలైకోట్టై వాలిబన్‌. జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్‌ మూవీ తక్కువ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లిజో  దర్శకత్వం వహించారు. 

తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోను స్ట్రీమింగ్ చేయనున్నారు. 

దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్‌ రోల్‌లో ఆకట్టుకున్నారు.  బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటించింది. మోహ‌న్ లాల్ కెరీర్‌లో మ‌ల‌యాళంలో అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. అయితే థియేట‌ర్ల‌లో ఈ మూవీ కేవ‌లం మ‌ల‌యాళంలో మాత్ర‌మే రిలీజైంది.

కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్‌ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటిష్‌ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)