Breaking News

మలయాళ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

Published on Sat, 09/20/2025 - 13:35

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam Movie). సంగీత్‌ ప్రతాప్‌, ది రాజాసాబ్‌ బ్యూటీ మాళవిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్‌ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన సత్యన్‌ అంతికాడ్‌ దర్శకత్వం వహించాడు. ఆశీర్వాద్‌ సినిమా బ్యానర్‌పై ఆంటొని పెరుంబవూర్‌ నిర్మించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించాడు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ హిట్‌ కొట్టింది. 

వచ్చేవారమే రిలీజ్‌
కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పటికీ కేరళలోని పలు థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. సినిమా రిలీజై మూడువారాలు దాటిపోవడంతో ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్‌ 26న విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

వరుస హిట్లు
మోహన్‌లాల్‌ ఈ ఏడాది ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజవగా ఆ మూడు కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టాయి. ఎల్‌2: ఎంపురాన్‌ మూవీ ఏకంగా రూ.260 కోట్లు రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి సినిమాగా రికార్డుకెక్కింది. తర్వాత తుడరుమ్‌ రిలీజ్‌ అవగా ఈ మూవీ కూడా రూ.230 కోట్లు వసూలు చేసింది. తర్వాత వచ్చిన హృదయపూర్వం రూ.70 కోట్లు కలెక్ట్‌ చేసింది. మరి మోహన్‌లాల్‌ మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి!

 

చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్‌పై సంజనా చీప్‌ కామెంట్స్‌

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)