Breaking News

దృశ్యం 3 షూట్‌ కంప్లీట్‌

Published on Wed, 12/03/2025 - 00:01

హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లోని సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ‘దృశ్యం’ సిరీస్‌ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ ఏడాది ‘దృశ్యం 3’ సినిమాను కూడా ప్రకటించారు మోహన్‌లాల్‌. ఈ ఏడాది సెప్టెంబరు మూడో వారం ‘దృశ్యం 3’ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. డిసెంబరు 2న ఈ’ సినిమా చిత్రీకరణ ముగిసిందని యూనిట్‌ సోషల్‌ మీడియా మాధ్యమాల వేదికగా పేర్కొంది. ఇలా అతి తక్కువ సమయంలోనే ‘దృశ్యం 3’ సినిమా చిత్రీరకణ పూర్తి కావడం విశేషం.

ఇక ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరంబవూర్‌ నిర్మించిన ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కనుంది. ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్‌లో వెంకటేశ్, హిందీ వెర్షన్‌లో అజయ్‌ దేవగన్‌ నటిస్తారు. కాగా, ‘దృశ్యం 3’ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేస్తామన్నట్లుగా ఆ మధ్య దర్శకుడు జీతూ జోసెఫ్‌ చెప్పారు.

మరి... జీతూ జోసెఫ్‌ అనుకున్నట్లుగానే ‘దృశ్యం 3’ సినిమా తెలుగు, హిందీ, మలయాళ  భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... మోహన్‌లాల్‌ హీరోగా నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘వృషభ’ ఈ డిసెంబరు 25న రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మోహన్‌లాల్‌ హీరోగా నటించి, విడుదలైన ‘ఎల్‌2: ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇంకా ‘దృశ్యం 3’ సినిమా తర్వాత రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘జైలర్‌ 2’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట మోహన్‌లాల్‌.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)