Breaking News

న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్‌బాబు

Published on Sun, 06/22/2025 - 12:43

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప (Kannappa Movie) మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఘనంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మానందం.. కన్నప్పను ఆదరించాలే తప్ప అల్లరి చేయొద్దని కోరాడు.

జోక్‌ చేసిన మోహన్‌బాబు
ఇకపోతే కన్నప్ప షూటింగ్‌ అంతా న్యూజిలాండ్‌లోనే జరిగింది. ఆ సమయంలో చిత్రయూనిట్‌ సరదాగా తీసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మోహన్‌బాబు.. ఓ మైదానంలో నిల్చుని ఇదంతా నాది, విష్ణుదే.. అన్నాడు. వీడియో తీస్తున్న బ్రహ్మాజీ.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వాళ్లు వింటున్నారుగా.. మొత్తం బ్లాక్‌మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని సరదాగా అన్నాడు.

7 వేల ఎకరాలు కొన్నాం
దాంతో మోహన్‌బాబు.. మా దగ్గర బ్లాక్‌మనీయే లేదు. న్యూజిలాండ్‌లోని వనాకాలో ఓ ఇల్లు, 7000 ఎకరాలు కొన్నాం. ఇదంతా మనదే అని జోక్‌ చేశాడు. ఇంతలో ప్రభుదేవా అక్కడికి రావడంతో ప్రభుదేవాతో కలిసి ఏడు వేల ఎకరాలు కొన్నట్లు మాట మార్చాడు. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జూన్‌ 27న విడుదల కానుంది. మోహన్‌లాల్‌, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

 

చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)