సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం
Breaking News
ఇదెంతో స్పెషల్ గిఫ్ట్.. మా అన్నయ్య ఏడ్చేశాడు: రాజమౌళి
Published on Thu, 03/16/2023 - 12:53
ఆస్కార్ విజయంతో ఆర్‌ఆర్‌ఆర్ పేరు ప్రపంచస్థాయిలో మార్మోగిపోతోంది. నాటు నాటు పాటకు సంగీతం అందించిన ఎమ్‌ఎమ్ కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌ను వేనోళ్ల కొనియాడుతున్నారు. తాజాగా వీరికి ఆస్కార్‌కు మించిన బహుమతి లభించింది. ఆస్కార్ కన్నా గొప్ప బహుమతి ఏముంటుంది అంటారా? కీరవాణి ఎంతగానో ఆరాధించే వ్యక్తి నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు. అమెరికన్ సింగర్ రిచర్డ్ కార్పెంటర్ ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ను, ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్‌లను అభినందిస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో రిచర్డ్‌తో పాటు అతడి కుటుంబం అంతా కలిసి శుభాకాంక్షలను పాట రూపంలో వెల్లడించారు.
ఈ వీడియోపై రాజమౌళి స్పందిస్తూ.. 'సర్, ఆస్కార్ క్యాంపెయిన్‌లో మా అన్నయ్య ఎంతో కామ్‌గా ఉన్నాడు. ఆస్కార్‌కు ముందు, తర్వాత.. ఎప్పుడూ తన ఎమోషన్స్ బయటపెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఈ వీడియో చూశాడో ఆ క్షణం తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. తనకు తెలియకుండానే చెంపలపై కన్నీళ్లు జాలువారాయి. మీ గిఫ్ట్ మా కుటుంబం అంతా గుర్తుంచుకుంటుంది. థాంక్యూ సో మచ్ అని' కామెంట్ చేశాడు. కీరవాణి ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేస్తూ.. 'నేను ఊహించని గిఫ్ట్ ఇది. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ ప్రపంచంలో నాకు దక్కిన అత్యంత విలువైన గిఫ్ట్' అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు.
https://t.co/va5tOLD1DH
— mmkeeravaani (@mmkeeravaani) March 15, 2023
This is something I didn’t expect at all ..tears rolling out of joy ❤️❤️❤️ Most wonderful gift from the Universe 🙏
Tags : 1