Breaking News

OTT: టామ్‌ క్రూజ్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌–ది ఫైనల్‌ రికనింగ్‌’ రివ్యూ

Published on Wed, 06/04/2025 - 13:55

హాలీవుడ్‌ సిరీస్‌లలో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’కి ప్రత్యేక  క్రేజ్‌ ఉంది. ఈ సిరీస్‌లో ఎనిమిదో భాగం మిషన్‌ ఇంపాజిబుల్‌–ది ఫైనల్‌ రికనింగ్‌ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. 

ఓ సీరియల్‌ను ప్రేక్షకులకు అలవాటుగా మార్చడం కొంచెం సులభం. కానీ అదే కథను సిరీస్‌ రూపంలో సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి. ఆ విషయంలో పాశ్చాత్య సిరీస్‌లు చాలావరకు విజయం సాధించాయి. అది కూడా పాతికేళ్ళకు పైగా ఒకే సిరీస్‌లో సినిమాలు నడపడమంటే మాటలా... ఇంపాజిబుల్‌. కానీ ఆ ఇంపాజిబుల్‌ టాస్క్‌ని పాజిబుల్‌ చేసి, ప్రేక్షకులను అలరిస్తున్న సిరీస్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. ఇటీవల ఈ హాలీవుడ్‌ సిరీస్‌లో 8వ సినిమాగా రిలీజ్‌ అయిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌–ది ఫైనల్‌ రికనింగ్‌’ సూపర్‌ అనే చెప్పాలి. 

క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈసారి కథానాయకుడైన ఇథన్‌ హంట్‌ స్టంట్స్‌ అదరహో అనేలా ఉన్నాయి.  సిరీస్‌లోని అన్ని సినిమాలలో ఇథన్‌ హంట్‌ పాత్రలో ప్రముఖ హాలీవుడ్‌ కథానాయకుడు టామ్‌ క్రూజ్‌ నటించారు. ఆయన నిజమైన సూపర్‌ స్టంట్స్‌తో ఆకట్టుకుంటారు. అందుకే ఈ సిరీస్‌ అంత స్పెషల్‌. ముఖ్యంగా ఎనిమిదో భాగంలో వచ్చే రెండు స్టంట్‌ ఎపిసోడ్లలో ప్రేక్షకులకు మతి పోతుందనే చెప్పాలి. 

సిరీస్‌ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్‌ ఇంపాజిబుల్‌. సిరీస్‌ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్‌ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్‌ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌–ది ఫైనల్‌ రికనింగ్‌’ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి... అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్‌ ఫీస్ట్‌ అనే చెప్పాలి. సో... ‘ఎంజాయ్‌ మిషన్‌ ఇంపాజిబుల్‌–ది ఫైనల్‌ రికనింగ్‌’ ఇన్‌ థియేటర్స్‌.  
– హరికృష్ణ ఇంటూరు  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)