Breaking News

డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

Published on Sun, 02/25/2024 - 15:36

స్టార్ హీరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. తమిళంలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ అక్కడ ఫలితం చూసి తెలుగు వెర్షన్ రిలీజ్ ఆలోచన మానుకున్నారు. ఇప్పుడీ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారట. తాజాగా స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా మూవీ?

ఈ సంక్రాంతికి తెలుగులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ చిత్రాలు రిలీజయ్యాయి. వీటిలో బాక్సాఫీస్ విన్నర్‌గా 'హనుమాన్' నిలిచింది. ఇది తప్పితే మిగతా మూడు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. మరోవైపు తమిళంలోనూ సంక్రాంతికి రిలీజైన 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కొన్నిరోజుల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చేశాయి. వీటితో పాటు తమిళంలో ఇదే పండక్కి 'మిషన్ ఛాప్టర్ 1' చిత్రం కూడా రిలీజైంది.

(ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

యాక్షన్ స్టోరీతో తీసిన ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ సొంత భాషలోనే తేడా కొట్టేయడంతో మన దగ్గర థియేటర్లలో విడుదల చేయడం అనే ఆలోచనని పూర్తిగా పక్కనబెట్టేశారు. అలా అందరూ మర్చిపోయిన ఈ చిత్రం నెట్‪‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధమైందట. మార్చి 1 నుంచి దక్షిణాది భాషల్లో అందుబాటులోకి రానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మిషన్ ఛాప్టర్-1 కథ విషయానికొస్తే.. ఆస్పత్రిలో ప్రాణాల‌తో పోరాడుతున్న త‌న కూతురిని ఎలాగైనా కలుసుకోవాలని.. విదేశీ జైలులో ఖైదీగా ఉండే హీరో అనుకుంటాడు? మరి ఇందుకోసం ఎలాంటి పోరాటం చేశాడు? విదేశీ జైలులో ఖైదీగా మార‌డానికి కార‌ణమేంటనేదే స్టోరీ. అరుణ్ విజయ్ హీరోగా నటించగా.. అమీజాక్స‌న్, నిమిషా స‌జ‌య‌న్ హీరోయిన్లుగా నటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)