Breaking News

మిస్‌ వరల్డ్‌ కధలు: సిఎంతో సారీ చెప్పించుకున్న హైదరాబాద్‌ బ్యూటీ...

Published on Sat, 05/24/2025 - 11:19

ఐశ్వర్యారాయ్‌ తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని 3వసారి  దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్‌(Diana Hayden) దక్కించుకుంది. 1997 మిస్‌ వరల్డ్‌ పోటీ విజేత మెయిన్‌ టైటిల్‌తో పాటు మూడు సబ్‌–టైటిళ్లను కూడా గెలుచుకుని అలా గెలిచిన ఏకైక మిస్‌ వరల్డ్‌గా నిలిచింది. జన్మతః హైదరాబాద్‌ నగరంలోని ఆంగ్లో–ఇండియన్‌  కుటుంబంలో జన్మించిన డయానా హేడెన్‌...  సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆమె పాఠశాల విద్యార్ధినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు దాంతో ఆమె 13 సంవత్సరాల వయస్సులోనే తన భృతి కోసం  పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది.

మిస్‌ వరల్డ్‌గా గెలిచిన ఏడాది తర్వాత, హేడెన్‌ లండన్‌ కు వెళ్లి రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రామాటిక్‌ ఆర్ట్‌ లో నటనను అభ్యసించింది. అక్కడ ఆమె షేక్స్పియర్ రచనలపై దృష్టి సారించి  ఉత్తమ నటి నామినేషన్‌ పొందింది.  ఆమె దక్షిణాఫ్రికాలో షేక్స్పియర్ ఒథెల్లో  చలనచిత్రంతో 2001 లో, తెరపైకి అడుగుపెట్టింది. ఇండియన్‌ టీవీ షో బిగ్‌ బాస్‌  రెండవ సీజన్‌ లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ పొంది  13 వ వారంలో ఓటింగ్‌ ద్వారా ఎలిమినేట్‌ అయింది. మిస్‌ వరల్డ్‌ గెలిచినప్పటికీ సినిమా టీవీ రంగాల్లో ఆమె పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. తెహ్‌ జీబ్, అబ్‌ బస్, లోన్‌ ఎ లవింగ్‌ డాల్‌...తదితర చిత్రాల్లో నటించినా ఆమె కేవలం ఒక సాదా సీదా నటిగానే మిగిలిపోయింది.

ఐశ్వర్యారాయ్, సుష్మితాసేన్‌ల తరహాలో కాకుండా బ్రౌన్‌ స్కిన్‌తో కొంత విలక్షణమైన అందంతో టైటిల్‌ గెల్చుకున్న డయానా హేడెన్‌ తన రూపం పట్ల కొందరు చేసిన పరుషమైన కామెంట్స్‌కు గురి కావాల్సి వచ్చింది. అలాంటివాటిలో ముఖ్యంగా ఆనాటి త్రిపుర సిఎం విప్లవ్‌కుమార్‌ దేవ్‌ ఆమె రూపాన్ని హేళన చేయడం ప్రస్తావనార్హం. అసలు మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలిచే సత్తా ఉన్న అందం ఆమెకు లేనేలేదని, ఐశ్వర్య గెలిచిందంటే ఓ అర్ధం ఉందని అంటూ ఆయన ఆమె రూపాన్ని ఎద్దేవా చేయడం సంచలనం సృష్టించింది. మనకు లక్ష్మి, సరస్వతి వంటి అందమైన దేవతలు ఉన్నారని డయానా లు కాదని అంటూ ఆయన తీవ్రమైన వ్యంగ్యోక్తులతో ఆమెను కించపరిచారు.  ఈ మాటలు తీవ్ర వివాదంగా మారడంతో ఆయన డయానాను క్షమాపణలు కోరారు.

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)