Breaking News

MIss World 2025: సిన్మా ఆఫర్లను ఛీ కొట్టిన మిస్‌ వరల్డ్‌

Published on Tue, 05/27/2025 - 11:20

పైకి ఎన్ని మాటలు చెప్పినా అందాల రాణులుగా రాణించాలనుకునే వారి అంతిమ లక్ష్యం సినిమాల్లో రాణించడమే అవుతుందనేది నిజం. అందుకు నిదర్శనాలెన్నో మనకు తెలుసు. అయితే అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకున్నప్పటికీ, తద్వారా వచ్చే అనేక రకాల ఆఫర్లను వాటి ద్వారా వచ్చే డబ్బు పేరు ప్రఖ్యాతుల్ని మాత్రం వద్దనుకున్న ఏకైక బ్యూటీ క్వీన్‌ రీటా ఫారియా(Reita Faria). మన భారతదేశపు తొలి మిస్‌ వరల్డ్‌. 

అప్పట్లోనే స్విమ్‌ సూట్‌ ధరించడమే కాకుండా బెస్ట్‌ ఇన్‌ స్విమ్‌ సూట్‌ అనే టైటిల్‌ని కూడా దక్కించుకున్న రీటా..అందాల ప్రదర్శన అంటే సినిమా అవకాశాల కోసమేననే అపోహలను 6 దశాబ్ధాల క్రితమే పటాపంచలు చేశారు. అందాల పోటీలను అత్యంత ప్రొఫెషనల్‌గా తీసుకున్న ఏకైక రోల్‌మోడల్‌గా నిలిచారు. 

ఆమె కధలోకి వెళితే... రీటా ఫారియా పావెల్‌ 1943 ఆగస్టు 23న ముంబైలోని మాతుంగా ప్రాంతంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు గోవా కాథలిక్కులు, తండ్రి జాన్‌ టివిమ్‌ అనే గ్రామానికి, తల్లి ఆంటోయినెట్‌ గోవాలోని శాంటా క్రజ్‌కు చెందినవారు,పెద్ద కుమార్తె ఫిలోమెనా తర్వాత ఫరియా వీరికి రెండవ కుమార్తె. ఆమెది మధ్యతరగతి కుటుంబం, తండ్రి మినరల్‌ వాటర్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు తల్లి బ్యూటీ సెలూన్‌ నడిపేవారు. యుక్తవయసులోనే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు వల్ల ఫరియా ఒక సగటు భారతీయ అమ్మాయిలా కాక అసాధారణంగా అనిపించేవారు. 

దాంతో ఆమె ’మమ్మీ లాంగ్‌ లెగ్స్‌ ’ అంటూ సహ విద్యార్థుల ఎగతాళికి గురయ్యారు. అయితే ఫారియా తన పొడవైన స్లిమ్‌ ఫిజిక్‌ని క్రీడలలో సత్తా చాటడం కోసం ఉపయోగించుకుని ’త్రోబాల్, నెట్‌బాల్‌ బ్యాడ్మింటన్‌ ఇలా పలు క్రీడల్లో రాణించారు. హాకీలో హ్యాట్రిక్‌ సాధించి తొలిసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్‌ బాంబే పోటీలో పాల్గొని గెలుచుకున్నారు. అదే ఊపులో ఈవ్స్‌ వీక్లీ మిస్‌ ఇండియా పోటీని గెలుచుకుని తద్వారా మిస్‌ వరల్డ్‌ 1966 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో, ’బెస్ట్‌ ఇన్‌ స్విమ్‌సూట్‌’ వ’బెస్ట్‌ ఇన్‌ ఈవినింగ్‌వేర్‌’ అనే ఉప–టైటిళ్లను గెలుచుకుని, ఫైనల్స్‌లో ఇతర దేశాల నుంచి∙పోటీ పడుతున్న 51 మంది ప్రతినిధులను ఓడించి మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని కూడా స్వంతం చేసుకున్నారు.

తొలి ఇండియన్‌ మిస్‌ వరల్డ్‌గా నిలిచిన ఆమెను అనేక రకాల ఆఫర్లు చుట్టుముట్టాయి. ముఖ్యంగా సినిమాల్లో నటింపజేయడానికి లాభదాయకమైన ఆఫర్లు విసిరారు. ఆకర్షణీయమైన ఆదాయం అంతకు మించి మరింత గొప్ప కెరీర్‌ కనిపిస్తున్నప్పటికీ, మోడలింగ్, నటన కాంట్రాక్టులను ఆమె నిస్సంకోచంగా తిరస్కరించారు. బదులుగా వైద్య విద్యపై దృష్టి పెట్టి గ్రాంట్‌ మెడికల్‌ కాలేజ్‌లో చేరి ఎం.బి.బి.ఎస్‌. డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్‌ లోని కింగ్స్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో చదువుకున్నారు. అదే సమయంలో గురుతుల్యులైన డేవిడ్‌ పావెల్‌ను 1971లో వివాహం చేసుకుని 1973లో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ కు మకాం మార్చారు, అక్కడ వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. 

ప్రస్తుతం ఫారియా తన భర్త, ఎండోక్రినాలజిస్ట్‌ డేవిడ్‌ పావెల్‌తో కలిసి ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ లో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. ఆ తర్వాత కూడా మన దేశంతో సహా పలు చోట్ల అందాల పోటీల్లో జడ్జిగా అతిధిగా పాల్లొన్న రీటా ఫరియా... ఎందరో అందగత్తెలకు మార్కులు వేశారు. అయితే అందాల పోటీలో గెలుపు అంటే అందలాలు ఎక్కడానికి పిలుపు కాదని నిరూపించిన రీటా మార్క్‌ మాత్రం చెరిగిపోనిదే... ఎప్పటికీ...

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)