Breaking News

స్వాతంత్య్ర సమరయోధురాలిగా మిస్‌ చెన్నై

Published on Fri, 02/17/2023 - 08:38

తొలి స్వతంత్ర సమరయోధురాలు వేలు నాచియార్‌ జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కనుంది. దీనికి మరుదుస్క్వేర్‌ అనే పేరును నిర్ణయించారు. దీన్ని జే.ఎం.బషీర్‌ తన ఫ్రెండ్స్‌ సినిమా పతాకంపై నిర్మించి పెద్ద మరుదు పాత్రను పోషించనున్నారు. ఈయన ఇప్పటికే దేశీయతలైవర్‌ చిత్రంలో టైటిల్‌ పాత్ర పసుమ్‌ పొన్‌ ముత్తురామలింగ దేవర్‌గా నటిస్తున్నారు. కాగా ఇందులో వేలు నాచియార్‌ అనే ప్రధాన పాత్రను బషీర్‌ కూతురు ఆయిషా పోషించనున్నారు. ఈమె 2019లో మిస్‌ చెన్నై అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్నారు. నటనపై ఆసక్తితో అందుకు కావలసిన శిక్షణ పొందారు.

శ్రీధర్‌ మాస్టర్‌ వద్ద డాన్స్, స్టంట్‌ మాస్టర్లు తవసీరాజ్, మిరాకిల్‌ మైఖెల్‌ ఫైట్స్‌లో శిక్షణ పొందారు. అదేవిధంగా మదుర్‌ ముత్తు లక్ష్మి వద్ద సిలంబాట్టం వంటి విలు విద్యలు నేర్చుకున్నారు. ఈ చిత్రానికి ఊమై విళిగల్, ఉళవన్‌ మగన్‌ చిత్రాల ఫేమ్‌ అరవింద్‌ రాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ప్రస్తుతం జెఎం.బషీర్‌ టైటిల్‌ పాత్రను పోషించిన దేశీయతలైవన్‌ చిత్రాన్ని పూర్తిచేశారు. ఈ చిత్రం విడుదల తరువాత మరుదు స్క్వేర్‌ చిత్రాన్ని సెట్‌ పైకి తీసుకెళ్లనున్నట్లు చిత్రం వర్గాలు గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. ఈ సినిమాకు ఒక ప్రముఖ సంగీత దర్శకుడు సంగీతాన్ని అందించనున్నారని, అదేవిధంగా చిన్న మరుదు పాత్రను పోషించడానికి ఒక ప్రముఖ నటుడితో చర్చలు జరుగుతున్నాయని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.

చదవండి: రెండు సీన్లు చూసి థ్రిల్‌ అయ్యా: అఖిల్‌

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)