Breaking News

నిర్మాతల సమస్యను కూడా అర్థం చేసుకోవాలి: కోమటిరెడ్డి

Published on Mon, 08/11/2025 - 18:55

తాము ఎప్పటికీ కార్మికుల పక్షానే ఉంటామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పట్టు, విడుపులు వదిలిపెట్టి సమస్యను పరిష్కరించుకోవాలని ఫిల్మ్ ఫెడరేషన్ప్రతినిధులకు సూచించారు. నిర్మాతల సమస్యను కూడా అర్థం చేసుకోవాలని.. మొండి పట్టుదలకు పోతే మీరే నష్టపోతారని తెలిపారు. టాలీవుడ్లో నెలకొన్న సమస్యపై ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు.

విడతలవారీగా వేతనాల పెంపుకు అంగీకరించాలని నిర్మాతల మండలికి మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రేపు మరోసారి ఫిలిం ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. మీరు సమ్మె చేస్తే చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని.. మీరు నిర్మాతల మండలి కలిసి కమిటీగా ఏర్పాటు కావాలన్నారు. ఒకే సారి పెంచాలంటే ఎవరికైనా ఇబ్బందేనని.. వెంటనే సమ్మెలు విరమించి పనిలోకి దిగాలని మంత్రి కోరారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మా పరిస్థితి వివరించాం: ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు

మా పరిస్థితిని మంత్రికి వివరించామని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. పలు అంశాలకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మేము చెప్పిన సమస్యలపై నిర్మాతలతో మంత్రి ఫోన్ చేసి మాట్లాడారని వెల్లడించారు. రేపటి సమావేశానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ వస్తానని చెప్పారని.. ఫిల్మ్ ఛాంబర్ భేటీలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపటి భేటీలో మా తరపున కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)