Breaking News

అశ్లీలతతో నిండిన ఆ వెబ్‌సైట్స్‌, ఓటీటీ యాప్స్‌ బ్యాన్‌

Published on Thu, 03/14/2024 - 13:46

అశ్లీలమైన, అసభ్యకరమైన  చిత్రాలను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను నిరోధించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) వివిధ మధ్యవర్తుల సమన్వయంతో చర్య తీసుకుంది. 19 వెబ్‌సైట్‌లు, 18 యాప్‌లను తొలగించేసింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా నిలిపేసింది. 'సృజనాత్మక వ్యక్తీకరణ' ముసుగులో అశ్లీలత, అసభ్యతతో కూడిన కంటెంట్‌ను  ప్రచారం చేయవద్దని కేంద్ర సమాచార & ప్రసార మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో  అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను తాజాగా తొలగించినట్లు ఠాకూర్ ప్రకటించారు.

బ్యాన్‌ అయిన ఓటీటీల జాబితా
Dreams Films, Neon X VIP, MoodX, Voovi, Besharams, Mojflix, Yessma, Hunters, Hot Shots VIP, Uncut Adda, Rabbit, Fugi, Tri Flicks, Xtramood, Chikooflix, X Prime, Nuefliks, Prime Play.

ఈ ప్లాట్‌ఫారమ్‌లలో  ప్రసారం అవుతున్న కంటెంట్‌లో ఎక్కువ భాగం అశ్లీలతతో కూడి ఉంది. అంతే కాకుండా మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరించిన పలు సినిమాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటి వల్ల సమాజంలో సంబంధాలు దెబ్బతింటాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ ఓటీటీ యాప్‌లను కొన్ని కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసకుని ఉపయోగిస్తున్న​​ట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ యాప్స్‌తో పాటు వెబ్‌సైట్స్‌ భారత్‌లో బ్యాన్‌ అవుతాయి.

IT చట్టంలోని సెక్షన్ 67, 67A, IPCలోని సెక్షన్ 292 మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం, 1986లోని సెక్షన్ 4ను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా కంటెంట్ నిర్ధారించబడింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)