Breaking News

దేవగుడి విజయం సాధించాలి: మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి

Published on Mon, 09/22/2025 - 04:25

‘‘దేవగుడి’ సినిమా ఫస్ట్‌ లుక్, గ్లింప్స్‌ బాగున్నాయి. ఈ చిత్రంలోని డైలాగులు మా కడప మాండలికంలో ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించి, దర్శక–నిర్మాత రామకృష్ణారెడ్డిగారికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరు తీసుకు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి చెప్పారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధానపాత్రలుపోషించిన చిత్రం ‘దేవగుడి’.

బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆదివారం నిర్వహించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్, గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌కి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి, ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమాలు వినోదం కోసమే కాదు... ప్రేక్షకులకు మంచి సందేశాన్నిచ్చేలా ఉండాలి’’ అన్నారు. ‘‘నవంబరులో విడుదల కానున్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని బెల్లం రామకృష్ణారెడ్డి కోరారు. సంగీత దర్శకుడు షేక్‌ మదీన్, కెమెరామేన్‌ లక్ష్మీకాంత్, నటుడు నాగేశ్వరరావుపాల్గొన్నారు.
 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)