Breaking News

‘రాబందు’హిట్‌ కావాలి: మంత్రి కోమటిరెడ్డి

Published on Tue, 11/11/2025 - 19:04

ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్, సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రాబందు’.  జయశేఖర్ కల్లు దర్శకత్వంలో పులిజాల సురేష్ నిర్మించిన చిత్రం ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్‌ చేసి యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.

అనంతరం గెస్ట్ గా వచ్చిన దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా చిత్ర నటి ప్రీతీ నిగమ్ టీజర్ లాంచ్ చేశారు. ఇంకా  సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర , రేణుకుమార్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రీతి నిగమ్ మాట్లాడుతూ..ట్రైలర్ చూస్తుంటే నాకు గూస్ బమ్స్ వచ్చాయి. అంత బాగా ఉంది. రాబందు అనే పక్షి ఎంత పట్టుదలతో ఉంటుందో ఈ సినిమా స్టోరీలో కూడా అదే పట్టుదలే కనిపిస్తుంది. ముఖ్యంగా మా డైరెక్టర్ & ప్రొడ్యూసర్ గారికి కాంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక సినిమా తీయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తన  కష్టార్జితాన్ని మొత్తం సినిమా కోసం పెట్టడం అనేది ఒక చాలా ధైర్యం కావాలి. ఆలా సినిమా మీదున్న ప్యాషన్ తో  మంచి సినిమా తీసిన  ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. నేను ప్రేక్షకులందరినీ చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి ఆదరించండి’ అన్నారు .

ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. యానిమల్ సినిమా లాగా రాబందు టైటిల్ చాలా మాస్ ఉంది. టైటిల్ లాగే ఈ సినిమా కూడా వైలెంట్ గా ఉంటుందనుకుంటున్నాను. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

చిత్ర దర్శకులు జయశేఖర్ కల్లు మాట్లాడుతూ.. నేటిసమాజంలో  జరుగుతున్న కొన్ని సంఘటనలన  ఆధారంగా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో  పులిజాల ఫిలిమ్స్  బ్యానర్ మీద మేము నిర్మించిన చిత్రం రాబందు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.  మా చిత్రాన్ని చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)