Breaking News

స్టేజ్‌పై నటికి చేదు అనుభవం.. ఫోలీసులకు ఫిర్యాదు

Published on Wed, 01/28/2026 - 14:52

ప్రముఖ నటి, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌లో చేదు అనుభవం ఎదురైంది. వేదికపై ప్రదర్శన ఇస్తుండగానే నిర్వాహకులు తనను అవమానించారని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది?
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా, బొంగావ్‌లో 'నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ్ క్లబ్' ఆధ్వర్యంలో ఈ నెల 25న  అర్ధరాత్రి ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. మిమీ చక్రవర్తి ప్రదర్శన ఇస్తున్న సమయంలో నిర్వాహకులలో ఒకరైన తన్మయ్ శాస్త్రి అకస్మాత్తుగా స్టేజ్‌పైకి వచ్చి కార్యక్రమాన్ని ఆపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను స్టేజ్ దిగి వెళ్ళిపోవాలని ఆదేశించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ అనుచిత ప్రవర్తనపై మిమీ చక్రవర్తి సోమవారం బొంగావ్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కళాకారుల పట్ల ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

ఈ ఘటనపై మిమీ చక్రవర్తి ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. మైకులో అందరి ముందూ తనను అవమానించేలా మాట్లాడారని, ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రిపబ్లిక్ డే వేళ స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుకుంటాం కానీ, మహిళా కళాకారులకు కనీస గౌరవం, భద్రత కరువయ్యాయని’ అంటూ తనకు ఎదురైన చేదు ఘటన గురించి వివరించింది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)