Breaking News

'మిడిల్‌ క్లాస్‌'తో రీఎంట్రీ ఇచ్చిన విజయలక్ష్మి

Published on Sun, 11/09/2025 - 06:53

ఇటీవల మంచి  కంటెంట్‌తో రూపొందుతున్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. మంచి కథ ఉంటే హీరో హీరోయిన్లు ఎవరైనా గానీ చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అలా పలు చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి పాపులర్‌ అయిన నటులలో మునీష్‌ కాంత్‌ ఒకరు. పలు చిత్రాల్లో క్యారెట్‌ ఆర్టిస్ట్‌ గానూ మెప్పించిన ఈయన తాజాగా హీరోగా అవతారం ఎత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిడిల్‌ క్లాస్‌. కాగా ఇంతకుముందు పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్‌ అయిన నటి విజయలక్ష్మి తాజాగా రీఎంట్రీ ఇవ్వడం విశేషం. 

ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దివంగత నిర్మాత ఢిల్లీబాబుకు చెందిన యాక్సెస్‌ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన తాజా చిత్రం మిడిల్‌ క్లాస్‌. కిషోర్‌ ముత్తు రామలింగం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వినోదభరిత కథాచిత్రంగా అనిపించినా , ఒక సందర్భంలో థ్రిల్లర్‌ బాణీలో  సాగుతుందన్నారు. 

ఇందులో నటుడు మునీష్‌ కాంత్‌ తన సొంత ఊరిలో స్థలం కొనుక్కుని సెటిల్‌ అవ్వాలని ప్రశాంతంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటాడన్నారు. అయితే ఆయన భార్య మాత్రం సిటీలో జీవించాలని ఆశపడుతుందన్నారు. అలా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభిస్తుందన్నారు. ఆ తర్వాత వారి సంతాన జీవితం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో చిత్ర కథ సాగుతుందన్నారు. ఇందులో నటుడు రాధారవి, వేల రామమూర్తి ముఖ్యపాత్రలు పోషించినట్లు చెప్పారు.   

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)