Breaking News

మా కోడలికి దక్కిన గొప్ప గౌరవం: మెగాస్టార్‌ ట్వీట్‌

Published on Mon, 08/04/2025 - 17:29

కోడలికి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ కో ఛైర్మన్‌గా అవకాశం దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. క్రీడల అభివృద్ధికి ఉపాసన నియామకం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది గొప్ప బాధ్యతతో పాటు మా కోడలికి దక్కిన గౌరవమని ట్వీట్ చేశారు. ఉపాసన నిబద్ధత, అభిరుచి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధానాలను రూపొందించడానికి ఉపాసన తప్పకుండా కృషి చేస్తుందని.. నీకు ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయని చిరంజీవి పోస్ట్ చేశారు.

కాగా.. మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ని నియమించింది. ఇందులో ఉపాసనకు చోటు దక్కింది. ఇందులో భాగంగా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విషయంమై క్రీడారంగాల్ని ప్రోత్సాహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవాళ్లతో ఓ బోర్డ్ ఏర్పాటు చేసింది. 

ఈ బోర్డ్‌లో ఐపీఎల్‌లో లక్నో జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంజీవ్ గోయెంకాని ఛైర్మన్‌గా నియమించారు. కో- ఛైర్మన్‌గా ఉపాసనకు బాధ్యతలు అప్పగించారు. బోర్డ్ సభ్యులుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, భూటియా, రవికాంత్ రెడ్డిని నియమించారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)