Breaking News

మెగాస్టార్‌కు ఆ దేశ పౌరసత్వం.. ఆయన టీమ్ ఏమన్నారంటే?

Published on Tue, 03/04/2025 - 15:40

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మువీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌లో చిరు సందడి చేశారు. అయితే తాజాగా మెగాస్టార్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుకు యూకే గౌరవ పౌరసత్వం అందించనుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ టీమ్ స్పందించింది. ఇటీవల ఓ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి తాను లండన్‌ వెళ్తన్నట్లు చెప్పడంతో ఈ ఈ వార్తలొచ్చాయి.

 ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందన్న వార్తలు అవాస్తవమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు రాసేముందు ముందుగా ధృవీకరించుకోవాలని తెలిపింది. విశ్వక్ సేన్ మూవీ లైలా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెగాస్టార్ లండన్‌ వెళ్లనున్నట్లు తెలిపారు. లండన్‌లో ఓ ఈవెంట్‌లో తనకు సన్మానం జరగనుందని మెగాస్టార్ తెలిపారు. దీంతో కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సిటిజెన్‌షిప్ గురించే లండన్‌ వెళ్తున్నారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా.. చిరంజీవి చివరిసారిగా భోలా శంకర్‌లో కనిపించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర్ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో చిరు జతకట్టనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)