Breaking News

మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

Published on Wed, 02/12/2025 - 14:38

మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన తన తాతయ్య గురించి మాట్లాడారు. మా కుటుంబంలో ఆయనకు ఓ ప్రత్యేకమైన అలవాటు ఉండేదని అన్నారు. ఆయన మంచి కళా పోషణ కలిగిన వ్యక్తి అని నవ్వుతూ మాట్లాడారు. బ్రహ్మనందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మెగాస్టార్.

చిరంజీవి మాట్లాడుతూ..'మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన స్వస్థలం నెల్లూరు అయితే మొగల్తూరు వచ్చి స్థిరపడ్డారు. అక్కడే స్టేట్ ఎక్సైడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా రిటైరయ్యారు. నీకు ఎవరి బుద్ది అయినా రావొచ్చు కానీ.. ఆయన బుద్ధి మాత్రం రాకూడదనేవారు. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. మా ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. వాళ్లద్దరిపై అలిగితే మూడో ఆమె దగ్గరికి వెళ్లేవారు. నాకు తెలిసి ముగ్గురే.. అలా నాలుగు, ఐదు ఉన్నారేమో నాకు తెలియదు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావ్ కదా జాగ్రత్త. అసలే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనను మాత్రం ఆదర్శంగా తీసుకొవద్దని చెప్పారు.' అని నవ్వుతూ సరదాగా అన్నారు మెగాస్టార్. ఇంకేముంది ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదే ఈవెంట్‌లో బ్రహ్మానందం తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు.

బ్రహ్మనందం మాట్లాడుతూ..'మా అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. నా తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు పెద్దరికంతో బతికారు. నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎప్పుడు గర్వపడుతుంటా. మా నాన్న నాకు ఒక మాట చెబుతుండేవారు.. ఒక మనిషి 18 రోజులు భోజనం చేయకపోతే చనిపోతాడు. 17 రోజుల వరకు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దు. 18వ రోజు తప్పనిసరి అయితేనే ఎవరినైనా సాయం అడుగు అనేవారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తా. నా జీవితంలో అప్పు అనే మాట తావులేదు' అని అన్నారు.

మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆ

కాగా.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే ప్రభాస్‌ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.  ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్‌ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు.
 

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)