Breaking News

'ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు'.. మెగాస్టార్ చిరంజీవి సంతాపం

Published on Mon, 11/24/2025 - 17:09

బాలీవుడ్ నట దిగ్గజం ధర్మేంద్ర మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో నా స్నేహితులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఆయన వారసత్వం లక్షలాది మంది హృదయాలలో సజీవంగా ఉంటుందని మెగాస్టార్ తెలిపారు.

చిరంజీవి తన ట్వీట్‌లో రాస్తూ..' ధర్మజీ కేవలం ఒక దిగ్గజ నటుడు మాత్రమే కాదు.. అద్భుతమైన మనిషి కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ వినయం, ఆప్యాయతను నేర్చుకున్నా. ఆయన మాటలు నా హృదయాన్ని లోతుగా తాకాయి. ఆయనతో నేను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలు, వ్యక్తిగత క్షణాలను జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటా. మృతికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నా. ఆయన వారసత్వం లక్షలాది మంది హృదయాలలో సజీవంగా ఉంటుంది. ఓం శాంతి' అంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.

జూనియర్ ఎన్టీఆర్ సంతాపం

ధర్మేంద్ర మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ధర్మేంద్ర జీ మరణవార్త విని చాలా బాధపడ్డా.. ఆయన గొప్ప శకాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేము.. భారతీయ సినిమాకు తీసుకొచ్చిన గొప్పతనం ఎప్పటికీ మనతో ఉంటుందని ట్వీట్ చేశారు. ఈ సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానంటూ పోస్ట్ చేశారు.

 

ధర్మేంద్ర మరణంతో రామ్ చరణ్ మూవీ పెద్ది టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రకటించాల్సిన అనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేసింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఇవ్వాల్సిన అప్‌డేట్‌ను పోస్ట్ పోన్‌ చేస్తున్నట్లు పెద్ది సినిమా నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ట్వీట్ చేసింది. ధర్మేంద్ర మరణం పట్ల సంతాపం తెలిపారు మేకర్స్.

 

 

 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)