Breaking News

మెగా ఫ్యాన్స్‌కు బిగ్‌ అప్‌డేట్‌.. ఆ రోజే సర్‌ప్రైజ్‌!

Published on Sun, 10/27/2024 - 18:15

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అనుకోకుండా సంక్రాంతి బరిలో నిలిచింది. చిరంజీవి పొంగల్ బరి నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో రామ్ చరణ్ వచ్చేస్తున్నారు. రిలీజ్‌కు ఇంకా 75 రోజుల సమయం ఉండడంతో మేకర్స్ నుంచి అప్‌డేట్స్ రావడం మొదలైంది. ఇప్పటికే నవంబర్‌లో కచ్చితంగా అప్‌డేట్స్‌ ఉంటాయని ప్రకటించిన టీమ్.. తాజాగా టీజర్ రిలీజ్‌పై హింట్ ఇచ్చింది.

త్వరలోనే గేమ్ ఛేంజర్‌ టీజర్ రిలీజ్ అవుతుందని ప్రకటించింది. నాలుగు రోజుల్లో దీపావళి ఉండడంతో మెగా ఫ్యాన్స్‌కు ఆ రోజే బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

(ఇది చదవండి: గేమ్ ఛేంజర్ విడుదల తేదీని ప్రకటించిన దిల్‌ రాజు)

కాగా.. ఈ  చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా ‍అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)