Breaking News

హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోన్న మెగా వారసురాలు.. ఆ సినిమాతోనే!

Published on Thu, 02/01/2024 - 21:59

మెగా వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి నిహారిక. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన మెగా డాటర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతంలో వెబ్‌ సిరీస్‌తో అలరించిన నిహారిక.. తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చైతన్య జొన్నలగడ్డతో తన వైవాహిక బంధానికి ముగింపు పలికిన తర్వాత తొలిసారి హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో నటనకు కొంతకాలం బ్రేక్‌ ఇచ్చిన నిహారిక డెడ్‌ పిక్సెల్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే అది అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేపోయింది. అంతే కాకుండా టాలీవుడ్‌లో నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా నిహారిక మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది.

తాజాగా రిలీజైన పోస్టర్‌ చూస్తే మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళ హీరో షేన్‌ నిగమ్‌కు జంటగా కనిపించనుంది. మద్రాస్‌కారన్‌ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

గతంలోనే రీ ఎంట్రీపై వార్తలు

గతేడాదిలోనే ఆమె మళ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో భారీగానే ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆమె మొదట సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గానే ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆమె సక్సెస్‌ కాలేకపోయింది. మళ్లీ ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై నిహారిక మెరిసేందుకు సిద్ధమైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)