Breaking News

చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్‌ యంగ్‌ హీరో!

Published on Thu, 04/24/2025 - 09:34

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi,), అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత అనిల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్‌ కెరీర్‌లో గుర్తిండిపోయేలా సినిమా ఉంటుందని అనిల్‌ చెబుతున్నాడు. 

ఇందులో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వింటేజ్‌ చిరంజీవి ఇందులో చూపించబోతున్నాడట. కామెడీతో పాటు మెగా ఫ్యాన్స్‌ ఆశించే యాక్షన్‌ కూడా ఇందులో ఉంటుందట. ఇందుకోసం అనిల్‌ బలమైన సీన్లు రాసుకున్నాడట. అంతేకాదు చిరంజీవిని ఢీకొట్టే విలన్‌గా ఓ యంగ్‌ హీరోని చూపించబోతున్నారట. అతనెవరో కాదు మెగాస్టార్‌ వీరాభిమాని కార్తికేయ(Kartikeya Gummakonda).

ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు కార్తీకేయ. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో విలన్‌గానూ నటించాడు. నాని ‘గ్యాంగ్ లీడర్’ తో పాటు అజిత్‌ ‘తెగింపు’లో కార్తికేయ విలన్‌గా నటించి అందరిని మెప్పించాడు. ఇప్పుడు మళ్లీ చిరంజీవి సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేయనున్నాడు. 

అయితే ఇందులో విలన్‌ కేవలం యాక్షన్‌ మాత్రమే కాకుండా కామెడీ కూడా చేస్తాడట. ఈ పాత్రకు కార్తికేయ అయితేనే న్యాయం చేస్తాడని అనిల్‌ అతన్ని సంప్రదించారట. చిరంజీవి సినిమా అనగానే కార్తికేయ కథ వినకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా టాలీవుడ్‌లో వినిపిస్తున్న రూమర్స్‌ మాత్రమే. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కార్తికేయ కూడా దీనిపై స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చిరంజీవితో కలిసి నటించాలనుకున్న కార్తికేయ  డ్రీమ్ ఫుల్ ఫిల్ అయిన‌ట్లే. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంకో సర్‌ప్రైజ్‌ కూడా ఉందట. విక్టరీ వెంకటేశ్‌ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతిథి పాత్రలో ఆయన నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.  ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్‌ క్లాప్‌ కొట్టిన సంగతి తెలిసిందే.  అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?