Breaking News

ఒకప్పుడు పండ్లు అమ్ముకుంటూ బతికాడు.. సినిమాల్లోకి వచ్చాక..

Published on Thu, 01/25/2024 - 18:33

రజనీకాంత్‌ నేరుగా సినిమాల్లోకి రాలేదు. ముందు బస్‌ కండక్టర్‌గా పని చేశాడు, తర్వాత సినిమాల్లోకి వచ్చి సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ కూడా మొదట్లో ఫుడ్‌ స్టాల్‌లో పని చేశాడు. మోడలింగ్‌ చేస్తూ చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ నేడు స్టార్‌ హీరో స్థాయికి ఎదిగాడు. అలా చాలామంది సినిమాల్లోకి రావడానికి ముందు అనేక పనులు చేశారు. ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి కూడా మొదట్లో పండ్లు అమ్మాడు. ఆ తర్వాతే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు కోట్లు విలువ చేసే కంపెనీ నడుపుతున్నాడు. అతడే కునాల్‌ కపూర్‌.

సినిమాకే అంకితమయ్యేవాడిని..
కునాల్‌ 18 ఏళ్ల వయసులో పండ్లు అమ్మేవాడట. ఈ విషయాన్ని అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'ఒక్కసారి నేను సినిమా ఒప్పుకున్నాక.. అబ్బా, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎన్నడూ అనుకోలేదు. సినిమాకే అంకితమయ్యేవాడిని. ఏదో ఒక పని చేయాలనుకుంటే సినిమాల్లోకి రాకముందు ఎలాగైతే పండ్లు ఎగుమతి చేసేవాడినో అదే పని కొనసాగించేవాడిని. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న డాలర్ రేటుతో పోలిస్తే ఈ వ్యాపారం మరింత లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ నాకు సినిమా అంటేనే ఇష్టం' అని చెప్పాడు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నటుడిగా..
'అక్స్‌' అనే మూవీతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టాడు కునాల్‌. తర్వాత నసీరుద్దీన్‌ షా నడిపిన యాక్టింగ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు. 'మీనాక్షి: ఎ టేల్‌ ఆఫ్‌ త్రీ సిటీస్‌' అనే సినిమాలో తొలిసారి నటించాడు. తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'రంగ్‌దే బసంతి'. ఈ మూవీలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కాలేజీ విద్యార్థిగా నటించాడు. ఈ సినిమా తర్వాత అతడు అవకాశాల కోసం వెంపర్లాడే పనిలేకుండా పోయింది. ఆయనను వెతుక్కుంటూ బోలెడన్ని ఛాన్సులు వచ్చిపడ్డాయి. డాన్‌ 2, ఆజ నచ్లే, బచ్నాయే హసీనో, డియర్‌ జిందగీ.. ఇలా ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించాడు.

ఎంతోమంది ప్రాణం నిలబెట్టిన 'కెట్టో'
ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌ కూడా! క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కెట్టో స్థాపకుల్లో ఈయన ఒకరు. కెట్టో అనేది.. ఆపదలో ఉన్నవారి కోసం విరాళాలు సేకరించే ప్లాట్‌ఫామ్‌. 2012లో జహీర్‌ అదెన్వాలా, వరుణ్‌ సేత్‌లతో కలిసి కునాల్‌ ఈ కెట్టోను ప్రారంభించాడు. ఇది ఎంత బాగా హిట్టయిందంటే.. ఇప్పటివరకు రూ.1249 కోట్ల విరాళాలాను సేకరించి ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఈ ప్లాట్‌ఫామ్‌ వల్ల సంస్థ వ్యవస్థాపకులకు దాదాపు రూ.110 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా కునాల్‌ కపూర్‌.. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కూ బంధువే! అమితాబ్‌ సోదరుడు అజితాబ్‌ కూతురు నైనాను కునాల్‌ పెళ్లాడాడు. అలా వరుసకు అమితాబ్‌కు అ‍ల్లుడయ్యాడు. కునాల్‌ చివరగా ద ఎంపైర్‌ అనే వెబ్‌ సిరీస్‌లో కనిపించాడు.

చదవండి: ఆ దర్శకుడు నేను సినిమాల్లోకి పనికి రానన్నాడు.. ఇప్పుడు రెండు చోట్లా..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)