Breaking News

‘కాంచ‌న 4'లో కొత్త అందం.. చాన్స్‌ ఇచ్చిన రాఘవ లారెన్స్

Published on Mon, 12/22/2025 - 15:38

సౌతిండియా నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్. ఆమె తాజాగా నటించిన చిత్రం  'స‌న్ ఆఫ్' (Son Of )ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు భారీ రెస్పాన్ వ‌స్తోంది. ఈ మూవీలో మీరా చేసిన త‌న పాత్రకు.. ఆమె స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఉత్తర భారతీయురాలైనా, స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. 

తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్‌ కొట్టేసింది. పాన్‌ ఇండియా చిత్రం కాంచన 4లో కీలక పాత్రలో నటించబోతోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘ‌వ లారెన్స్, నోరా ఫతేహి లాంటి స్టార్ నటీనటులతో కలిసి నటించడం మీరా రాజ్‌కు బిగ్ ఛాన్స్‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ మూవీ డైరెక్ట‌ర్ రాఘవ లారెన్స్‌పై మీరా రాజ్‌కు అపారమైన గౌరవం ఉంది.“నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను” అని మీరా భావోద్వేగంగా చెప్పింది.

ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో తన పాత్రను మరింత సహజంగా మలచుకోవడానికి మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్‌పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)