Breaking News

హీరోయిన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వారంపాటు అమ్మ బాధలోనే: డైరెక్టర్‌

Published on Mon, 02/24/2025 - 19:39

ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన (Trinadh Rao Nakkina). తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న మూవీ మజాకా (Mazaka Movie). సందీప్‌ కిషన్‌, రీతూ వర్మ, రావు రమేశ్‌, అన్షు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ఈవెంట్స్‌లో త్రినాధ రావు మన్మథుడు హీరోయిన్‌ అన్షు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో అతడు క్షమాపణలు చెప్పాడు.

ఎలాంటి శిక్ష వేసినా ఓకే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి త్రినాధరావు మాట్లాడుతూ.. నేను కావాలని అన్షుపై అలాంటి కామెంట్స్‌ చేయలేదు. ఏదో సరదా చేద్దామనుకోబోయి అనుకోకుండా నోరు జారాను. తప్పు సరిదిద్దుకునేలోపే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. తర్వాత అందరికీ క్షమాపణలు చెప్పాను. నేను దురుద్దేశంతో అలాంటి మాటలు మాట్లాడితే ఎలాంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. అప్పటికీ నోరు జారి తప్పు చేశానని ఫీలయ్యాను. అందుకే అన్షుతో పాటు అందరికీ సారీ చెప్పాను. అప్పటికే అన్షుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకు ఫోన్‌ చేసి విషయం మొత్తాన్ని వివరించా. తను అర్థం చేసుకుంది. 

అమ్మను చూసి భయమేసింది
ఈ వివాదం జరిగినప్పుడు నాకంటే మా అమ్మ ఎక్కువ బాధపడింది. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నువ్వు ఎందుకు నాన్నా నోరు జారావు? అందరూ ఎలా విమర్శిస్తున్నారో చూశావా? ఒక్క పదం నిన్ను దుర్మార్గుడిని చేసింది. నువ్వు నిజంగా దుర్మార్గుడివా? కాదని ఎంతమంది దగ్గరకు వెళ్లి చెప్పగలం? ఇకమీదట స్టేజీ ఎక్కినప్పుడు ఆచితూచి మాట్లాడమని చెప్పింది. అమ్మ వారం రోజులు డీలా పడిపోయింది. తననలా చూసి భయమేసింది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా అన్నాడు త్రినాధరావు.

చదవండి: కావాలనే రాంగ్‌ మెడిసిన్‌ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)