Breaking News

మజాకా సూపర్ హిట్‌.. అప్పుడే మరో సినిమా!

Published on Sat, 03/01/2025 - 18:19

టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఇటీవల మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సందీప్ కిషన్‌, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ వస్తోంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద మజాకా దూసుకెళ్తోంది. ఇటీవల మజాకా మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్స్ కూడా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మజాకా సినిమాను నవ్వుతూ ఎంజాయ్ చేయాలని డైరెక్టర్‌ త్రినాథరావు ఆడియన్స్‌కు సూచించారు.

(ఇది చదవండి: సినిమా చూసిన దిల్‌ రాజు ఆ ఒక్క మాట అన్నారు: మజాకా డైరెక్టర్)

అయితే ఒక పక్కా మజాకా సక్సెస్‌ ఎంజాయ్ చేస్తూనే మరో సినిమా పనిలో నిమగ్నమయ్యారు దర్శకుడు త్రినాథరావు. అప్పుడే మరో యంగ్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు. టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్‌ యువ హీరో హవీశ్ కోనేరుతో జతకట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ‍త్వరలోనే రివీల్ చేయనున్నారు. ప్రతిభావంతులైన యువ హీరోలను ప్రోత్సహిస్తూ తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. తెలుగులో సినిమా చూపిస్తావా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా లాంటి సినిమాలతో సూపర్‌హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు త్రినాథరావు. కాగా.. కోనేరు నువ్విలా, జీనియస్‌, సెవెన్ లాంటి సినిమాలతో యంగ్ హీరో హవీశ్ గుర్తింపు తెచ్చుకున్నారు.
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు