Breaking News

'మాతృదేవోభవ'తో కన్నీళ్లు పెట్టించిన మాధవి ఏం చేస్తుందో తెలుసా..?

Published on Sun, 05/11/2025 - 12:26

‘మాతృదేవోభవ’ 1993లో వచ్చిన మేటి చిత్రాల్లో బ్లాక్‌బస్టర్‌ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్‌ మాధవి నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఆ పాత్రకు ఆమె కనెక్ట్‌ అయ్యారు. ఆమె భర్తగా నాజర్‌ చాలా కీలకమైన భూమిక పోషించారు. అయితే నేడు ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని  సినిమాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో నటి మాధవి ప్రస్తుతం ఎలా ఉందొ చూడండి అంటూ కొన్ని ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

80,90లో తన అందం, అభిమనయంతో ఆకట్టుకున్న నటి మాధవి చాలా ఏళ్ల క్రితమే వెండతెరకు దూరమయ్యారు. అందంలో జయసుధ, జయప్రద వంటి హీరోయిన్స్‌కి పోటినిచ్చిన ఆమె ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారంటూ ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె లేటెస్ట్‌ ఫొటోలు చూసి అభిమానులంతా షాక్‌ అవుతున్నారు. తన తెనె కళ్లతో మాయ చేసిన ఆమె ఇంతలా మారిపోయారేంటంటూ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మెప్పించిన మాధవి దాదాపు 300 సినిమాల వరకు చేశారు. చిరంజీవి ‘ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైది వంటి సినిమాల్లో ఆమె చిరంజీవికి జోడికట్టారు.

చెప్పాలంటే అప్పట్లో చిరు-మాధవి పెయిర్‌ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉండేది. ఇక మాధవి గ్లామర్‌, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యం తన కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్‌ ఎంతో మంది ఉన్నారు. అందులో లేడి ఫ్యాన్స్‌ కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్లకే సినీరంగ​ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగారు. ఇక ఆమె కెరీర్‌లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ‘మాతృదేవోభవ’. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్‌ ఇప్పటికి ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది.

ముఖ్యం ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అలా నటిగా కెరీర్‌ పీక్‌లో ఉండగానే మాధవి సడెన్‌గా వెండితెరకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన బిజినెస్‌ మెన్‌ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని ఫారిన్‌లో సెటిలైపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలు ఎదగడంతో భర్తకు సాయంగా బిజినెస్‌ వ్యవహరాలను చూసుకుంటున్న మాధవి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటోలు షేర్‌ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లెటెస్ట్‌ ఫొటోలు చూసి నెట్టింట వైరల్‌గా మారాయి.

'మాతృదేవోభవ'ను వదులుకున్న జీవిత
మాతృదేవోభవ సినిమాలో నటించాలని మొదట సీనియర్‌ నటి జీవితా రాజశేఖర్‌కు చిత్రయూనిట్‌ సంప్రదించింది. అయితే, ఆమెకు అప్పటికే పెళ్లి కావడంతో గృహిణిగా ఉండాలని నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆమె సున్నితంగా కాదని చెప్పారు. దీంతో ఆ పాత్ర మాధవి చేసింది. తర్వాత సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆమె బాధపడలేదు. భర్త, పిల్లలే తన ప్రపంచం అంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 1990లో 'మగాడు'లో ఆమె చివరిసారిగా నటించారు.  మళ్లీ 33 ఏళ్ల తర్వాత ఇటీవల ‘లాల్ సలాం’లో కనిపించారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)