Breaking News

మరో ఓటీటీలో 'మసూద'.. భయపెడుతూ, థ్రిల్‌ని పంచే సినిమా

Published on Wed, 04/23/2025 - 13:10

మసూద సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా 2022లో విడుదలైన ఈ చిత్రం  బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే.  చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పటికే ఈ బ్యానర్‌ నుంచి మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించారు.

మసూద సినిమా కొత్త రకమైన హారర్‌ డ్రామాతో రూపొందడంతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల్ని భయపెడుతూ, థ్రిల్‌ని పంచడంతో ఈ మూవీకి భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆహా (AHA) తెలుగు ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే, తాజాగా అమెజాన్‌ ‍ప్రైమ్‌ (Amazon Prime Video)లో కూడా మసూద స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ మూవీలో సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథేంటంటే.. 
నీలం(సంగీత) ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. భర్త అబ్దుల్‌(సత్య ప్రకాశ్‌)కు దూరంగా ఉంటూ.. కూతురు నాజియా(బాంధవి శ్రీధర్‌)తో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో రెంట్‌కు ఉంటుంది. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే గోపీ(తీరువీర్‌) ఓ సాఫ్ట్‌వేర్‌. తన సహోద్యోగి మినీ(కావ్యా కళ్యాణ్‌ రామ్‌)ని ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండడంతో నీలం ఫ్యామిలీకి క్లోజ్‌ అవుతాడు.  అప్పుడప్పుడు గోపీతో కలిసి నీలం, నాజియా బయటకు వెళ్తుంటారు. అయితే ఓ రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది.  అర్థరాత్రి వేళ ఏదోదో మాట్లాడుతుంది. కూతురిని అలా చూసి భయపడిన నీలం.. గోపీని సహాయం అడుగుతుంది. నాజియా ప్రవర్తను చూసిన గోపీ.. ఆమెకు దెయ్యం పట్టిందని గ్రహిస్తాడు. ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్‌(సత్యం రాజేశ్‌) సలహాతో పీర్‌ బాబా(శుభలేఖ సుధాకర్‌)ను కలుస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సమస్యలు ఏంటి? నాజియా ఆత్మలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?  మసూదను మీర్‌ చాచా ఎందుకు చంపాడు? నాజియాను రక్షించడానికి గోపీ చేసిన సాహసం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మసూద’చూడాల్సిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)