Breaking News

రూ.100 కోట్ల సినిమా.. డైరెక్టర్‌కి గిఫ్ట్‌గా కాస్ట్‌లీ కారు

Published on Tue, 10/31/2023 - 08:03

సినిమా హిట్ అయితే హీరో, డైరెక్టర్ ఎంత ఆనందపడతారో.. ఆ మూవీ తీసిన నిర్మాత అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీలవుతాడు. ఎందుకంటే కోట్లు పెడతాడు కదా! అలా లాభాలు వచ్చిన ఆనందంలో చిత్రబృందానికి కళ్లు చెదిరే బహుమతులు ఇస్తుంటారు. మొన్నీమధ్య 'జైలర్' నిర్మాత కార్ల దగ్గర నుంచి గోల్డ్ కాయిన్స్ వరకు చాలా ఇచ్చాడు. ఇప్పుడు మరో నిర్మాత.. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడి రుణం తీర్చుకున్నాడు.

(ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!)

హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అప్పుడెప్పుడో 'పందెం కోడి' లాంటి సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో మన దగ్గర హిట్ కొట్టలేకపోయాడు. చాలా ఏళ్ల తర్వాత 'మార్క్ ఆంటోని'గా వచ్చిన విశాల్.. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

'మార్క్ ఆంటోని'లో విశాల్ కంటే ఎస్‌జే సూర్య నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. టైమ్ ట్రావెల్ యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ తెలుగులో డీసెంట్ టాక్ అందుకుంది. ఈ చిత్రంతో హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్‌ని నిర్మాత వినోద్ సర్‌ప్రైజ్ చేశాడు. దాదాపు రూ.90 లక్షలు విలువైన బీఎండబ్ల్యూ కారు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)