Breaking News

సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!

Published on Sat, 07/15/2023 - 12:22

ప్రముఖ నటుడు, మరాఠీ సినిమా దర్శకుడు రవీంద్ర మహాజనీ ఆకస్మికంగా కన్నుమూశారు. రవీంద్రకు 77 ఏళ్లు. పూణేలోని తలేగావ్ దభాడేలోని అంబి ప్రాంతంలోని అతని ఫ్లాట్‌లో నటుడి మృతదేహం కనుగొనబడినట్లు చెప్పబడింది. రెండు మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

(ఇది చదవండి: ‘బిగ్‌బాస్‌ 7’లోకి బ్యాకాంక్‌ పిల్ల.. వీడియోతో క్లారిటీ)

అయితే రవీంద్ర మహాజని గత కొన్ని నెలలుగా అద్దె ఫ్లాట్‌లోనే ఒంటరిగా నివాసముంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఉంటున్న అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పక్కనే ఉంటున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా నటుడు శవమై కనిపించాడు. దీంతో ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు. ఆయన మృతితో మరాఠాతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

రవీంద్ర మరాఠీ సినిమాతో పాటు హిందీ సినిమాల్లో కూడా పనిచేశారు. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఆయనను వినోద్ ఖన్నా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం, రూపం రెండూ వినోద్ ఖన్నాను పోలి ఉన్నాయి. రవీంద్ర పలు మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ నటించిన 'సాత్ హిందుస్తానీ' చిత్రంలో రవీంద్ర మహాజని పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించారు. ఇదే అతని మొదటి సినిమా. ఆ తర్వాత మరాఠీలో 'ఆరం హరమా ఆహే', 'దునియా కరీ సలామ్', 'హల్దీ కుంకు' చిత్రాలకు పనిచేశాడు. 'ముంబయి చా ఫౌజ్దార్' (1984), 'కలత్ నకలత్' (1990)తో పాటు ఆయన నటించిన 'లక్ష్మీ చి పావ్లే' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.  

రవీంద్ర మహాజని కుమారుడు  గష్మీర్ మహాజని హిందీ సీరియల్ 'ఇమ్లీ'లో నటించారు. కుమారుడితో కలిసి తెరపై తొలి మరాఠీ చిత్రం 'క్యారీ ఆన్ మరాఠా'లో అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని కూడా గష్మీర్ తన తండ్రికి అంకితమిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు 2019లో వచ్చిన అర్జున్ కపూర్,  కృతి సనన్ చిత్రం 'పానిపట్'లో కూడా కలిసి పనిచేశారు. రవీంద్ర చివరిసారిగా నటించిన చిత్రం కూడా ఇదే.

(ఇది చదవండి: స్లిమ్‌ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!)

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు