'సినీ ఇండస్ట్రీలో మహిళలను అలానే చూస్తారు'.. మాజీ మిస్ వరల్డ్‌ పోస్ట్ వైరల్!

Published on Sat, 05/31/2025 - 19:42

మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మనదేశంలో మిస్ వరల్డ్‌ పోటీలు జరుతుగున్న వేళ.. ఏ రంగంలోనైనా మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి గౌరవం  లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కేవలం గ్లామర్‌ వస్తువుగానే చూస్తున్నారని మానుషి చిల్లర్‌ అభిప్రాయపడింది. తాజాగా ట్విటర్ వేదికగా ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

మానుషి తన ట్వీట్‌లో  రాస్తూ.. 'స్త్రీల పట్ల ద్వేషపూరిత మనస్తత్వం ఉన్నవారు.. స్త్రీ సాధించిన విజయం కంటే ఆమె వెనుక పురుషుడి ఉన్నాడని ఆపాదించడం సులభంగా భావిస్తారు. వాస్తవ ప్రపంచంలో ఎటువంటి ప్రభావం చూపని ఇలాంటి తెలివితక్కువ వ్యాఖ్యలను పట్టించుకోవడం నేను ఎప్పుడో మానేశా. కానీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే మహిళలను అగౌరవంగా చూడడం.. నేను నిరంతరం గమనిస్తూనే ఉన్నా. లింగ భేదం లేకుండా మనమందరం సమాన విలువ, సాధికారత, విద్యావంతులైన వాతావరణంలో పెరిగాం. కానీ పురుషులు విజయం సాధిస్తే కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులని పొగుడుతారు. అదే మహిళలు సాధిస్తే అవకాశవాదులని ముద్రవేస్తారు. ఇలాంటి అనుభవాన్ని నేను కూడా ఎదుర్కొన్నా. ఒక స్త్రీ గురించి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు చెడుగా మాట్లాడడం అంత సులభమా? లేదా ఏళ్లుగా పాతుకుపోయిన పక్షపాతమా' అని ప్రశ్నించింది. ముఖ్యంగా మహిళల విజయాన్ని పురుషులకు అపాదించడాన్ని మానుషి చిల్లర్‌ విమర్శిస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే మానుషి చిల్లర్‌.. అక్షయ్ కుమార్  నటించిన  పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'సామ్రాట్ పృథ్వీరాజ్'తో  బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  విక్కీ కౌశల్ సరసన'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ'లో నటించింది. టాలీవుడ్‌లో వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలెంటైన్'లో ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించింది. మానుషి చివరిసారిగా 'బడే మియాన్ చోటే మియాన్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ మాజీ మిస్ వరల్డ్ జాన్ అబ్రహం థ్రిల్లర్ మూవీ'టెహ్రాన్'లో కనిపించనుంది. ఈ బాలీవుడ్ భామ 017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)