చంద్రబాబు గూటిలో చిలక షర్మిల.. గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కామెంట్స్
Breaking News
మా సినిమాను ధురంధర్‌తో పోల్చకండి: దర్శకుడు
Published on Sat, 04/11/2026 - 08:32
ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్. గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. అనగా, అతుల్య రవి, రైసా విల్సన్, సంజనా సింగ్, కాళీ వెంకట్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎఫ్ఐఆర్ ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ గురువారం (ఏప్రిల్ 9న) ప్రీరిలీజ్ కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా మంజు వారియర్ మాట్లాడుతూ.. స్పై థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొంది. గౌతమ్ రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఇది 70 శాతం యాక్షన్ సన్నివేశాలతో కూడిన సినిమా అన్నారు. దర్శకుడు మను ఆనంద్.. ఈ మూవీ ప్రపంచంలో ఏడు చోట్ల జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని తెలిపారు. హిందీ మూవీ ధురంధర్ కూడా వాస్తవ సంఘటనలతో రూపొందినా.. ఆ చిత్రాన్ని మిస్టర్ ఎక్స్‌తో పోల్చరాదని పేర్కొన్నారు.
Tags : 1