Breaking News

ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

Published on Wed, 10/04/2023 - 13:36

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ మాన్షన్‌ 24. అవికా గోర్‌, సత్యరాజ్‌, బిందు మాధవి, రాజీవ్‌ కనకాల, రావు రమేశ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ యాంకర్‌ కమ్‌ డైరెక్టర్‌ ఓంకార్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్‌ చేశారు. 'జాతీయ సంపదను దోచుకున్న కాళిదాసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు' అన్న హెడ్‌లైన్‌తో ట్రైలర్‌ మొదలైంది.

అయితే తాను దేశద్రోహి కూతుర్ని కాదని, నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని, దాన్ని నిరూపిస్తానంటూ సీన్‌లోకి ఎంటరైంది వరలక్ష్మి శరత్‌కుమార్‌. కనిపించకుండా పోయిన తండ్రి కోసం, అతడి మీద వేసిన దేశద్రోహి అనే నిందను తొలగించేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగుతుంది. తండ్రి కోసం వెతుకులాట మొదలుపెడుతుంది. ఈ క్రమంలో అతడి తండ్రి చివరిసారిగా ఓ కోటకు వెళ్లినట్లు తెలుసుకుంటుంది. అక్కడికి వెళ్లినవారెవరూ తిరిగి రాలేదని అందరూ చెప్తూ ఉంటారు.

అయినా సరే, తన తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవాలని పాడుబడ్డ మాన్షన్‌లోకి అడుగుపెడుతుంది. అక్కడ వరలక్ష్మికి ఎదురైన పరిణామాలేంటి? తన తండ్రి నిజాయితీపరుడా? దేశద్రోహా? వరలక్ష్మి అక్కడి నుంచి తిరిగి ప్రాణాలతో బయటపడిందా? వంటి విషయాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! ఈ వెబ్‌ సిరీస్‌ అక్టోబర్‌ 17 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్‌ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌? ఎవరా మిస్టరీ మ్యాన్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)