Breaking News

'ఆదిపురుష్'.. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు

Published on Sat, 07/25/2026 - 21:00

'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో రిలీజైనప్పుడే కాదు ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉంటుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ టాపిక్ వచ్చిన ప్రతిసారి నెటిజన్లు ఓం రౌత్‌ని ఇష్టమొచ్చినట్లు తిడుతూనే ఉంటారు. అయితే ఈ చిత్రానికి పనిచేసిన పాటల రచయిత, జాతీయ అవార్డ్ గ్రహీత మనోజ్ ముంతాశిర్.. అప్పట్లో మూవీ టీమ్‌కి అండగా మాట్లాడాడు. ఇప్పుడు మాత్రం జనాలకు సారీ చెబుతూ, ఈ మూవీ చేయడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

'మొదట్లో వచ్చిన విమర్శలని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండు రోజుల్లోనే ప్రజల ఆవేదన అర్థమైంది. 'ఆదిపురుష్' నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఆ సినిమాని విడుదల తర్వాత సమర్థించడం అంతకంటే పెద్ద తప్పు. ఆ సినిమా చుట్టూ జరిగిన పరిణామాలన్నింటికీ చాలా సిగ్గుపడుతున్నా. జరిగిన దానికి దేశ ప్రజలందరినీ క్షమాపణలు కోరుతున్నా'

సినిమాలోని సంభాషణలపై వచ్చిన విమర్శలని గుర్తు చేసుకున్న ఈయన.. 'ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ డైలాగ్స్ నేను ఎలా రాశానో నాకు కూడా అర్థం కావడం లేదు. వాటిని రాసినందుకు చాలా సిగ్గుగా ఉంది. అలాగే శ్రీరాముడు, హనుమంతుడు లాంటి పవిత్ర పాత్రలకు నేను ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాను. ఆ టైంలో నేను మాట్లాడిన మాటలు, ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన వ్యాఖ్యలని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు'

(ఇదీ చదవండి: నా కొడుకుతో 'సిసింద్రీ 2' సినిమా చేస్తా: అఖిల్)

''ఆదిపురుష్'కు మద్దతుగా మాట్లాడొద్దని నా భార్య ముందుగానే హెచ్చరించింది. సినిమా విడుదలకు దాదాపు ఆరునెలల ముందే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. సినిమా తీయడంపై ప్రేక్షకుల్లో చాలా సందేహాలు వచ్చాయి. అలాంటి టైంలో నేను మూవీని సమర్థిస్తే మొత్తం వ్యతిరేకత నాపై పడుతుందని నా భార్య చెప్పింది' అని పాటల రచయిత మనోజ్ ముంతాశిర్ చెప్పుకొచ్చాడు.

2023 జూన్‌లో 'ఆదిపురుష్' రిలీజైంది. రామాయణం ఆధారంగా ఈ సినిమా తీశారు. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. వీరిలో రాముడు, రావణుడి పాత్రలపై వచ్చిన ట్రోల్స్ అన్నిఇన్నీ కావు. అయినా సరే రూ.400 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు టెక్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)