Breaking News

మంజుమ్మల్‌ బాయ్స్‌ డైరెక్టర్‌తో విక్రమ్‌..

Published on Sun, 04/07/2024 - 10:19

మంజుమ్మల్‌ బాయ్స్‌.. ఈ మధ్యకాలంలో మారుమోగిపోతున్న మలయాళ చిత్రం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేరళలోనే కాకుండా తమిళనాడులోనూ అనూహ్య విజయాన్ని సాధించింది. తెలుగులోనూ డబ్‌ అయి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అంతటి సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాకు చిదంబరం దర్శకుడిగా వ్యవహరించాడు. డైరెక్టర్‌గా ఇది ఈయనకు రెండో సినిమా!

చిదంబరానికి ప్రశంసలు
కోలీవుడ్‌లో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, విక్రమ్‌, ధనుష్‌ల నుంచి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను పొందారీయన. ఈయన దర్శకత్వంలో చిత్రాలు చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. హీరో ధనుష్‌ కూడా చిదంబరం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయినట్లు ప్రచారం జరిగింది. అయితే కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా ఆయన నటించలేకపోయినట్లు సమాచారం.

విక్రమ్‌తో మూవీ
తాజాగా చియాన్‌ విక్రమ్‌ దర్శకుడు చిదంబరం డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు దర్శకుడు విక్రమ్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం తంగలాన్‌ చిత్రాన్ని పూర్తి చేసిన విక్రమ్‌ తన 62వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత దర్శకుడు చిదంబరం దర్శకత్వంలో విక్రమ్‌ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చదవండి: అర్థరాత్రి నడి రోడ్డుపై ఐస్‌క్రీమ్‌ తింటూ చిల్‌ అవుతున్న నయన్‌.. వీడియో వైరల్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)