Breaking News

ఏం జేద్దామంటవ్‌ మరి.. కేసీఆర్‌ డైలాగ్‌ అందుకే పెట్టాం: మణిశర్మ

Published on Fri, 07/26/2024 - 13:59

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి మార్‌ ముంత.. చోడ్‌ చింత అనే సాంగ్‌ రిలీజైంది. ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ వాయిస్‌ను ఉపయోగించారు. ఏం జేద్దామంటవు మరి? అనే డైలాగ్‌ను యథాతథంగా వాడేశారు. దీన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్రంగా విమర్శించారు.

మీమ్స్‌ నుంచి..
ఈ పాట చిత్రీకరణ అంతా కల్లు కాంపౌండ్‌లోనే జరుగుతుంది. ఇలాంటి మందు పాటలో కేసీఆర్‌ డైలాగ్‌ ఎలా వాడతారని మండిపడ్డారు. తాజాగా ఈ వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ వివరణ ఇచ్చాడు. 'కేసీఆర్‌ గారు గొప్ప వ్యక్తి. ఆయన మనందరికీ ఫేవరెట్‌.. ఆయన్ను చాలా మీమ్స్‌లో చూస్తుంటాం. అలా మీమ్స్‌లో నుంచి ఆ డైలాగ్‌ తీసి వాడాం. ఎంజాయ్‌.. పండగ అనేది కూడా మీమ్స్‌ నుంచి తీసిన డైలాగే..

ఐటం సాంగ్‌ కాదు
ఈ అల్టిమేట్‌ సాంగ్‌లో కేసీఆర్‌ డైలాగ్‌ పెడితే బాగుంటుందనుకున్నాం. అంతే తప్ప ఆయన్ను కించపరచాలని కాదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే చేశాం. దయచేసి దీన్ని తప్పుగా తీసుకోకండి. పైగా ఇది ఐటం సాంగ్‌ కాదు, హీరోహీరోయిన్లు కలిసి చేసే డ్యూయెట్‌ సాంగ్‌' అని క్లారిటీ ఇచ్చాడు.  ఇక ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

 

చదవండి: రాజ్‌ తరుణ్‌ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)