Breaking News

మద్యపానంతో ఇబ్బందులు పడ్డా.. జీవితం తలకిందులైంది: సీనియర్ హీరోయిన్

Published on Mon, 07/17/2023 - 16:04

బాలీవుడ్ నటి, మనీషా కొయిరాలా బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లోనే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించింది. నేపాల్‌లోని ఖాఠ్మండులో జన్మించిన మనీషా కొయిరాలా.. 1991లో సుభాష్ ఘై చిత్రం సౌదాగర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతకుముందే 1989లో ఫేరి భతౌలా అనే నేపాలీ చిత్రంలో నటించింది.

(ఇది చదవండి: 7 ఏళ్లకే పనిమనిషిగా.. 10 ఏళ్లకే సినిమాల్లోకి.. కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్‌)

అప్పటి నుంచి ఆమె కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్‌ హీరోలందరితో సినిమాలు చేసింది. ఆమె నటించిన బొంబాయి చిత్రంలో అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో నాగార్జున సరసన క్రిమినల్, అర్జున్‌తో ఒకే ఒక్కడు, నగరం, భారతీయుడు, బూచి, లేడీ టైగర్, నోటుకు పోటు లాంటి చిత్రాల్లో కనిపించింది. ఇటీవల కార్తీక్ ఆర్యన్‌ నటించిన షెహాజాదాలో హీరోకు తల్లిపాత్రలో నటించింది. 


 
అయితే మనీషా కొయిరాల ఎంత ‍త్వరగా గొప్ప పేరు తెచ్చుకుందో.. ఆమె కెరీర్‌  కూడా అంతే వేగంగా పతనమైంది.  ఆ తర్వాత అప్పట్లో ఆమె నేపాల్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పట్లో ఆమె మద్యానికి కూడా బానిసైంది. గతంలో మనీషా మద్యం సేవించిన ఓ వీడియో నెట్టింట్లో కనిపించింది. ఆ వీడియోలో మద్యం మత్తులో ఉన్న మనీషా కొయిరాలాను మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుండగా వద్దని వేడుకుంది. మద్యానికి బానిస కావడం పట్ల మనీషా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మద్యపానం వల్ల జీవితంలో కష్టాలు పడ్డానని తెలిపింది. 

మనీషా కొయిరాలా మాట్లాడుతూ.. 'మద్యం నా జీవితంలోకి వచ్చాక పరిస్థితి అంతా తలకిందులైంది. నా జీవితం ఇంతలా మారతుందనినేను గ్రహించలేదు. అప్పుడు చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా. మనం మద్యం తాగడం ప్రారంభిస్తే దానివల్ల సమస్యలు పరిష్కారం కావు. జీవితంలో అది మన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మద్యం తాగుతారు. మా నాన్న కొన్నిసార్లు తాగేవారు. కానీ మన పరిస్థితులను అర్థం చేసుకుని మెలగాలి. అప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది.' అని ‍అన్నారు. కాగా.. 2010లో మనీషా తన తోటి నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని పెళ్లాడింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు.

(ఇది చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్)

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)