Breaking News

ముగ్గురు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు ఒకేచోట.. సాంగ్‌తో రచ్చలేపారు!

Published on Fri, 07/11/2025 - 19:27

రీరిలీజ్‌ ట్రెండ్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహేశ్‌బాబు (Mahesh Babu) బర్త్‌డేను పురస్కరించుకుని అతడు మూవీ ఆగస్టు 9న మరోసారి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని థియేటర్‌లో ఎప్పుడెప్పుడు చూస్తామా? అని మహేశ్‌ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కౌంట్‌డౌన్‌ కూడా మొదలుపెట్టేశారు. ఇకపోతే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2005 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

20 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌
త్రిష కథానాయికగా నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) సంగీతం అందించాడు. బాక్సాఫీస్‌ వద్ద రచ్చ లేపిన ఈ మూవీకి మూడు నంది అవార్డులు వరించాయి. ఈ సూపర్‌ హిట్‌ చిత్రం 20 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందులో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు కోటి, తమన్‌, మణిశర్మ ఒకే పాటకు సంగీతం వాయించారు. అతడు సినిమాలోని అవును నిజం.. నువ్వంటే నాకిష్టం సాంగ్‌ మ్యూజిక్‌ ట్రాక్‌ వాయించారు. 

ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఒకేచోట
నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు, మూడేళ్ల కిందటిది. నా గురువులు మణిశర్మ, కోటి గార్లతో ఓ అద్భుతమైన రోజు అని గతంలో తమన్‌ స్వయంగా ఈ వీడియో షేర్‌ చేశాడు. అతడు రీరిలీజ్‌ నేపథ్యంలో అది మరోసారి వైరల్‌ అవుతోంది. మణిశర్మ దగ్గర తమన్‌ దాదాపు ఎనిమిదేళ్లపాటు అసిస్టెంట్‌గా పని చేశాడు. తనదైన స్టైల్‌లో ట్యూన్స్‌ ఇస్తూ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు.

చదవండి: ఆ రెండు సాంగ్స్‌ లేకుంటే కన్నప్ప మళ్లీ చూసేవాళ్లం.. అది మా బుద్ధి

Videos

హాలీవుడ్ రేంజ్ లో అల్లు అర్జున్ మూవీ

వినుత మాస్టర్ ప్లాన్.. ఆ వీడియోల కోసమే చంపేసింది!

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. స్టంట్ చేస్తుండగా మాస్టర్ మృతి

టీడీపీ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత

సీనియర్ నటి బీ.సరోజాదేవి కన్నుమూత

జగన్ ను ఫాలో అవ్వండి.. కడపలో కూటమి ఫ్లెక్సీ.. వినుత డ్రైవర్ కేసులో బిగ్ ట్విస్ట్

భార్య విడాకులు.. పాలతో స్నానం చేసిన భర్త

వీళ్ల కష్టం సూస్తున్నర పవన్ కల్యాన్‌ సారూ!

భర్తతో సైనా నెహ్వాల్ విడాకులు

వీడియోలు వేసి మరీ.. చంద్రబాబుపై పేర్ని కిట్టు మాస్ ర్యాగింగ్

Photos

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం సాగరతీరంలో సండే సందడి (ఫొటోలు)

+5

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)

+5

కోట శ్రీనివాసరావు మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు (ఫోటోలు)

+5

వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు

+5

Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)

+5

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)