Breaking News

అతను నా ప్రేమను రిజెక్ట్‌ చేశాడు.. నెలల తరబడి ఏడ్చాను: పాయల్‌ రాజ్‌పుత్‌

Published on Wed, 11/08/2023 - 11:16

‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌కి పరిచమైంది హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ ఖాతాలో మాత్రం సరైన హిట్‌ పడలేదు. దీంతో కొంతకాలం తెలుగు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి.. ‘మంగళవారం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన కెరీర్‌లో భారీ హిట్‌ అందించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ఫేమ్‌ అజయ్‌ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాయల్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

(చదవండి: హీరో విజయ్‌ విడాకుల రూమర్స్‌.. లియో నటి ఏమందంటే?)

వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి లవ్‌స్టోరీని వెల్లడించింది పాయల్‌. మీ క్రష్‌ ఎవరనే ప్రశ్నకు పాయల్‌ సమాధానం ఇస్తూ.. ‘స్కూల్‌ డేస్‌లో ఓ అబ్బాయిని పిచ్చిగా ప్రేమించాను. అతన్ని చూడగానే నాలో ఏదో తెలియని ఆనందం కలిగేది. దాన్నే నేను ప్రేమగా భావించాను. టెన్త్‌ క్లాస్‌ ఎండింగ్‌లో నా ప్రేమ విషయాన్ని అతనికి చెప్పాను.

(చదవండి: నిర్లక్ష్యం.. నిండు ప్రాణం ఖరీదు.. టాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్!)

కానీ అతను నా లవ్‌ ప్రపోజ్‌ని రిజెక్ట్‌ చేశాడు. తనకు ప్రేమపై ఆసక్తి లేదని చెప్పాడు. దీంతో నేను నెలల తరబడి ఏడ్చాను. చదువుపై శ్రద్ద పెట్టలేక పోవడంతో ఆ ఏడాది పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాను. ఆ విషయాన్ని అమ్మకి చెప్పి ఏడ్చాను. ఆమె నాకు మద్దతుగా నిలిచి.. నేను మళ్లీ మామూలు పరిస్థితికి వచ్చేలా సహాయపడింది’అని నాటి సంగతులను గుర్తు చేసుకుంది.

ఇంకా ఆమె మాట్లాడుతూ. ‘మంగళవారం’ షూటింగ్‌ సమయంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడ్డానని, జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవేనంటూ ఎమోషనల్‌ అయింది. నీళ్లు తక్కువగా తాగడం కారణంగానే తనకు కిడ్నీ సమస్యల ఏర్పడిందన్నారు. దయచేసి అందరూ నీళ్లు ఎక్కువగా తాగండి అని పాయల్‌ విజ్ఞప్తి చేశారు. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)