Breaking News

మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు

Published on Fri, 09/06/2024 - 00:48

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహిళల భద్రత, రక్షణలను మరింత మెరుగుపరచడం కోసం వారి తరఫున ప్రాతినిధ్యం వహించేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు ‘మా’ అధ్యక్షుడిగా నాది ఒక విజ్ఞప్తి.

తెలుగ చిత్ర పరిశ్రమలోని మహిళల భద్రత, రక్షణ మరింత మెరుగుపడేలా, వారి తరఫున ప్రాతినిధ్యం ఉండేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయండి. కెమెరా ముందు, వెనక ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలన్న దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. భద్రత, సాధికారితలకు చలన చిత్ర పరిశ్రమ ప్రతిరూపంగా నిలిపేందుకు తెలుగు ఇండస్ట్రీలో భాగమైన ప్రతి ఒక్కర్నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నాం’’ అంటూ గురువారం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే...  మలయాళ పరిశ్రమలో జస్టిస్‌ హేమా కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చాక ఇతర పరిశ్రమల్లోనూ ఆ తరహా కమిటీ ఏర్పాటు చేయాలని పలువురు స్టార్స్‌ అంటున్న విషయం తెలిసిందే. తెలుగులో ఉన్న విభాగాల్లో ఓ కీలక విభాగం అయిన ‘మా’ తరఫున మంచు విష్ణు కమిటీ ఏర్పాటుని ప్రతిపాదించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)