Breaking News

24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్‌.. మంచు విష్ణు ఎమోషనల్‌ ట్వీట్‌

Published on Thu, 06/26/2025 - 17:25

మరికొన్న గంటల్లో(జూన్‌ 27) మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు ఫ్యామిలీ, ముఖ్యంగా విష్ణు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్‌ (దాదాపు రూ. 250 కోట్లు) పెట్టి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అదే రేంజ్‌లో ప్రమోషన్స్‌ కూడా భారీగానే చేశారు. 

దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లోనూ సినిమా ఈవెంట్స్‌ నిర్వహించారు. విష్ణు పడిన కష్టానికి ఫలితం తగ్గింది. ఈ సినిమాకు కావాల్సినంత రీచ్‌ అయితే వచ్చినట్లు ఉంది. అందుకే రిలీజ్‌కి ముందే భారీగా టికెట్స్‌ అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమా టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోనే  1,15,000 టికెట్స్‌ సేల్‌ చేసి కన్నప్ప  రికార్డు సృష్టించింది.  ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు.

‘24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్ అయిపోయాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత గొప్ప ప్రేమను పొందడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ప్రేమ చూపుతున్న ప్రతీ మూవీ లవర్‌కు థాంక్స్. ఇది సినిమా కాదు మహా శివుడి మహిమ.. కన్నప్పకు అంకితం’ అంటూ విష్ణు ట్వీట్‌ చేశాడు. 

కన్నప్ప విషయానికొస్తే.. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌తో పాటు శరత్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్‌ కీలక పాత్రలు పోషించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)